తెలంగాణ పరిషత్ ఎన్నికల్లో విజేతలు వీరే…

Wednesday, June 5th, 2019, 10:14:33 AM IST

ఇటీవల తెలంగాణాలో జరిగినటువంటి ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఈరోజు ఉదయమే 8 గంటల సమయంలో సంబంధిత అధికారులు అందరు కూడా ఈ ప్రక్రియను ప్రారంభించారు. కాగా గతనెల 6,10,14 తేదీల్లో 5,659 ఎంపీటీసీలు, 534 జెడ్పిటీసీస్థానాలకు 3 మూడు విడతలుగా ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కాగా నేడు వీటి ఫలితాలు వెలువడ్డాయి…

కాగా ఇప్పటివరకు విడుదలైన ఫలితాల ప్రకారం ఈ ఎన్నికల ఫలితాలలో కూడా అధికార తెరాస పార్టీ తన హవాని కొనసాగిస్తూ విజయపథంలో దూసుకుపోతుంది. కాగా ఈ ఎన్నికల ఫలితాల్లో తెరాస ముందంజలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానానికే పరిమితం అయింది. కాగా బీజేపీ మూడో స్థానాన్ని నిలుపుకుంది. అంచనాలను మించి ఇతరులు కూడా దూసుకుపోతున్నారు. అయితే తెలంగాణలో లో జరిగిన మొత్తం 534 స్థానాలకు ఎన్నికలు జరగగా అధికార తెరాస పార్టీ 372 స్థానాల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ పార్టీ కేవలం 53 స్థానాల్లో విజయం సాధించగా, కేవలం 6 స్థానాల్లో విజయాన్ని నమోదు చేసుకుంది.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 5,356 ఎంపీటీసీ స్థానాలు, 83 జడ్పీటీసీ స్థానాలకు ఫలితాలు వెల్లడయ్యాయి. ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్- 3,291, కాంగ్రెస్ – 1,248, బీజేపీ – 194, తెలుగుదేశం – 21, వామపక్షాలు – 75, ఇతరులు-527 స్థానాలు కైవసం చేసుకున్నాయి. జెడ్పిటీసీ ఫలితాల్లో టీఆర్ఎస్ – 70, కాంగ్రెస్ – 13 స్థానాల్లో విజయం సాధించింది.

ఆదిలాబాద్ జిల్లా జడ్పీటీసీలు. మొత్తం 17 స్థానాలు. టీఆర్‌ ఎస్ – 8, బిజేపి – 5, కాంగ్రెస్ – 4

నార్కెట్ పల్లి లో 11 ఓట్లతో టీఆర్‌ఎస్ అభ్యర్థి బండ నరేందర్ రెడ్డి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు.

మహబూబ్ నగర్ లో… 71 జడ్పీటీసి స్థానాల్లో 66 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం. కాంగ్రెస్ 04, బీజేపి 01 స్థానంలో విజయం సాధించారు.

నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్- 24 కాంగ్రెస్-7 యాదాద్రి జిల్లా:- టీఆర్‌ఎస్-14 కాంగ్రెస్-3 సూర్యాపేట జిల్లా:- టీఆర్‌ఎస్-19 కాంగ్రెస్-4

మహబూబాబాద్:

మొత్తం జెడ్పిటిసి స్థానాలు 16….14స్థానాలను కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్. మహాబుబాబాద్-ప్రియాంక (520)-టీఆర్‌ఎస్, పెద్దవంగర- జ్యోతిర్మయి (6232)-టీఆర్‌ఎస్, నర్సీలపేట -సంగీత (1175)-టీఆర్‌ఎస్, తొర్రురు- శ్రీనివాస్ (9632)-టీఆర్‌ఎస్, డోర్నకల్- కమల (3357).టీఆర్‌ఎస్, రవి బండి వెంకట్ రెడ్డి (4000)-టీఆర్‌ఎస్ , గంగారాం- రమ (451)-కాంగ్రెస్, కొత్తగూడ- పుష్పాలత (294)- కాంగ్రెస్, దంతాలపల్లి -వెంకటేశ్వర రెడ్డి- (8050)-టీఆర్‌ఎస్, చిన్నగూడూర్ -సునితరెడ్డి (2900)-టీఆర్‌ఎస్, గార్ల- ఝాన్సీ- (1500)- టీఆర్‌ఎస్, మరిపెడ -శారదా (14000)- టీఆర్‌ఎస్, బయ్యారం -బిందు (6934)-టీఆర్‌ఎస్, గూడూర్- సూచరిత (1300) -టీఆర్‌ఎస్, కేసముద్రం- శ్రీనాథ్ రెడ్డి (2545)-టీఆర్‌ఎస్, నెల్లికుదుర్- శ్రీనివాసరెడ్డి (1500)- టీఆర్‌ఎస్,

మంచిర్యాల జిల్లాలో గెలిచిన అభ్యర్థలు 1.హజీపూర్ – పుస్కురి శిల్ప శ్రీనివాసరావు- టీఆర్‌ఎస్, 2.లక్షెటిపేట-కొత్త సత్తయ్య -కాంగ్రెస్, 3.దండేపల్లి-గడ్డం నాగ రాణి-కాంగ్రెస్ , 4.మందమర్రి- రవి -టీఆర్‌ఎస్, 5.జన్నారం- శేఖర్ – టీఆర్‌ఎస్, 6.జైపూర్- మేడి సునీత-టీఆర్‌ఎస్, 7.భీమరం- భూక్య తిరుమల- టీఆర్‌ఎస్ రెబల్, 8.చెన్నూర్- మోతె తిరుపతి- టీఆర్‌ఎస్, 9.కోటపల్లి- నల్లాల భాగ్యలక్ష్మి-టీఆర్‌ఎస్, 10.వేమనపల్లి- స్వర్ణలత-టీఆర్‌ఎస్, 11.కన్నెపల్లి-సత్యనారాయణ-టీఆర్‌ఎస్, 12.నెన్నెల-సింగతి శ్యామల-టీఆర్‌ఎస్, 13.భీమిని-పోతురాజుల గంగక్క-కాంగ్రెస్, 14.బెల్లంపల్లి- తొంగల సత్యనారాయణ-టీఆర్‌ఎస్, 15.తాండూరు- సాలిగామ బాణయ్య-టీఆర్‌ఎస్, 16.కాసిపేట- పల్లె చంద్రయ్య- టీఆర్ఎస్

పెంచికల్ పేట్ జడ్పిటీసి టిఆర్ఎస్ అభ్యర్థి సముద్రాల సరితరాజన్న గెలుపు..

బెజ్జూర్‌ జడ్పిటీసి టిఆర్ఎస్ అభ్యర్థి పుష్పలత గెలుపు.. మెజారిటీ.. 3400

దహేగాం జడ్పిటీసి టిఆర్ఎస్ అభ్యర్థి రామారావు గెలుపు.. మెజారిటీ..

చింతలమానేపల్లి జడ్పిటీసి టిఆర్ఎస్ అభ్యర్థి డుబ్బుల శ్రీదేవి గెలుపు.. మెజారిటీ.. 1500

కౌటాల జడ్పిటీసి టిఆర్ఎస్ అభ్యర్థి స్వప్న గెలుపు.. మెజారిటీ.. 2500

కౌటాల జడ్పిటీసి టిఆర్ఎస్ అభ్యర్థి స్వప్న గెలుపు.. మెజారిటీ.. 2500

సిర్పూర్ (టి) జడ్పిటీసి టిఆర్ఎస్ అభ్యర్థి నిరేటి రేఖ సత్యనారాయణ గెలుపు.. 2177 మెజారిటీ..

కాగజ్‌నగర్‌ జడ్పిటీసి టిఆర్ఎస్ అభ్యర్థి లోని కృష్ణరావు.. గెలుపు.. 12800 మెజారిటీ

నల్లగొండ జిల్లాలో మొత్తం 349 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ 191, కాంగ్రెస్‌ 132, బీజేపీ 3, సీపీఎం 5, సీపీఐ 2, ఇతరులు 16 స్థానాలను కైవసం చేసుకున్నారు.

భువనగిరి మండలం వీరెల్లి ఎంపీటీసీ స్థానంలో టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ అభ్యర్థి టాస్ నెగ్గి ఎంపీటీసీ అయ్యాడు. మొదట 3 ఓట్ల ఆధిక్యంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించగా… ప్రత్యర్థి అభ్యర్థి రీకౌంటింగ్ కోరాడు. దీంతో రీకౌంటింగ్‌లో ఇద్దరికీ సమాన ఓట్లు రావడంతో చివరకు టాస్ ద్వారా విజేతని నిర్ణయించగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థినే విజయం వరించింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కారు దూసుకెళ్తోంది. 3 వేల 555 పైచిలుకు ఎంపీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. 1375 ఎంపీటీసీ స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకుంది. 210 ఎంపీటీసీ స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. 591 ఎంపీటీసీ స్థానాలను ఇతరులు గెలుచుకున్నారు.

ఇప్పటివరకు ప్రకటించిన ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్-3461, కాంగ్రెస్-1413, బీజేపీ-206 కైవసం. 582 ఎంపీటీసీ స్థానాల్లో ఇతరులు గెలుపు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 11 జెడ్పిటీసీ స్థానాలకు గానూ 6 టీఆర్ఎస్, 4 కాంగ్రెస్, ఇతరులు ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే జెడ్పిటీసీ ఛైర్మన్ పదవిని టీఆర్ఎస్ కైవసం చేసుకోనుంది.

జనగాం జిల్లాలో 12 స్థానాలకు గానూ 12 స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

ములుగు జిల్లాలో 8 స్థానాలకు గానూ.. టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 1 స్థానంలో గెలుపొందారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 11 స్థానాలకు గానూ.. టీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 5, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు.

మహబూబ్‌నగర్ జిల్లా 16 స్థానాలకు గానూ 7 స్థానాలు టీఆర్ఎస్ కైవసం.

వరంగల్ జెడ్పీటీసీ ఫలితాలు: టీఆర్ఎస్: వరంగల్ అర్బన్ 7 స్థానాలకు గానూ 7 స్థానాలు గెలుపు… వరంగల్ రూరల్ 16 స్థానాలకు గానూ 16 సీట్లు గెలుపు

మంచిర్యాల జిల్లాలో 130 ఎంపీటీసీ స్థానాలకు గానూ.. టీఆర్ఎస్ 83, కాంగ్రెస్ 39, సీపీఐ 1, ఇండిపెండెంట్‌లు 7 స్థానాల్లో గెలుపొందారు.

కామారెడ్డి జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పిటీసీ ఓట్ల లెక్కింపు పూర్తి. మొత్తం 236 ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ 149, కాంగ్రెస్ 61, బీజేపీ 4, ఇతరులు 22 సీట్లు కైవసం చేసుకున్నాయి. మొత్తం 22 జెడ్పిటీసీ స్థానాల్లో 14 టీఆర్ఎస్, కాంగ్రెస్ 8 సీట్లు గెలిచాయి

జగిత్యాల జిల్లా జెడ్పిటీసీ ఎన్నికల్లో బీర్‌పూర్ మినహా 18కి 17 స్థానాల్లో టీఆర్ఎస్ విజయ దుంధుబి

ఖమ్మం జిల్లాలో 20 జెడ్పిటీసీలకు గానూ.. 17 టీఆర్ఎస్, ఒక్కటి కాంగ్రెస్ గెలుపు

భద్రాద్రి జిల్లాలో 21 జెడ్పిటీసీలకు గానూ 14 టీఆర్ఎస్, 3 కాంగ్రెస్, ఒకటి టీఆర్ఎస్ రెబల్, ఒకటి న్యూడెమోక్రసీ కైవసం

జెడ్పిటీసీ ఎన్నికల్లో జనగాం జిల్లాలో అన్ని స్థానాలను(12) కైవసం చేసుకున్న టీఆర్ఎస్

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన జెడ్పిటీసీ ఎన్నికల్లో 20 స్థానాల్లో ఛైర్మన్ పదవులను టీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం

వనపర్తి జిల్లా ఎంపీటీసీ ఫలితాల్లో మొత్తం 14 స్థానాలకు గానూ.. 13 టీఆర్ఎస్, ఒక స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

గద్వాల జిల్లా ఎంపీటీసీ ఫలితాల్లో మొత్తం 141 స్థానాలకు గానూ.. 101 టీఆర్ఎస్, 11 కాంగ్రెస్, బీజేపీ 19, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు.

మహబూబ్‌నగర్ జిల్లా ఎంపీటీసీ ఫలితాల్లో మొత్తం 232 స్థానాలకు గానూ.. 114 టీఆర్ఎస్, 38 కాంగ్రెస్, బీజేపీ 6, ఇతరులు 11 స్థానాల్లో విజయం సాధించారు

రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీ ఫలితాల్లో మొత్తం 257 స్థానాలకు గానూ.. 126 టీఆర్ఎస్, 75 కాంగ్రెస్, బీజేపీ 18, ఇతరులు 37 స్థానాల్లో విజయం సాధించారు

వికారాబాద్ జిల్లా ఎంపీటీసీ ఫలితాల్లో మొత్తం 221 స్థానాలకు గానూ.. 126 టీఆర్ఎస్, 71 కాంగ్రెస్, ఇతరులు 07 స్థానాల్లో విజయం సాధించారు

మేడ్చల్ జిల్లా ఎంపీటీసీ ఫలితాల్లో మొత్తం 42 స్థానాలకు గానూ.. 20 టీఆర్ఎస్, 12 కాంగ్రెస్, బీజేపీ 1, ఇతరులు 9 స్థానాల్లో విజయం సాధించారు

యాదాద్రి భువనగిరి జిల్లా ఎంపీటీసీ ఫలితాల్లో మొత్తం 176 స్థానాలకు గానూ.. 81 టీఆర్ఎస్, 66 కాంగ్రెస్, బీజేపీ 1, ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించారు

జనగాం జిల్లా ఎంపీటీసీ ఫలితాల్లో మొత్తం 134 స్థానాలకు గానూ.. 96 టీఆర్ఎస్, 33 కాంగ్రెస్, ఇతరులు 10 స్థానాల్లో విజయం సాధించారు

భద్రాద్రి జెడ్పి ఛైర్మన్ అభ్యర్థి కోరం కనకయ్య టేకులపల్లి నుంచి జెడ్పిటీసీగా గెలుపు

ఇప్పటివరకు అందిన ఎంపీటీసీ ఫలితాల్లో 3,461 టీఆర్ఎస్, 1413 కాంగ్రెస్, 206 బీజేపీ, 582 ఇతరులు కైవసం చేసుకున్నారు

సిరిసిల్ల జిల్లా 12 జెడ్పిటీసీ స్థానాలకు గానూ.. 11 స్థానాల్లో టీఆర్ఎస్, ఒక్క స్థానంలో కాంగ్రెస్ గెలుపు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు జెడ్పిటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థిని గోరుపల్లి శారదా సంతోష్ రెడ్డి విజయం

ఆలేరు జెడ్పిటీసీ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేష్ 2,513 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

మిర్యాలగూడ జెడ్పిటీసీ ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజ

ఖమ్మం జిల్లాలో జెడ్పిటీసీ ఫలితాల్లో టీఆర్ఎస్ 7 స్థానాల్లో గెలుపు

భద్రాద్రి జిల్లాలో టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 1, న్యూ డెమోక్రసీ 1 స్థానంలో విజయం

కరీంనగర్ జిల్లాలో 15 జెడ్పిటీసీ స్థానాలకు గానూ.. 15 స్థానాల్లో టీఆర్ఎస్ ఘన విజయం.

కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లా జెడ్పిటీసీలు టీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం

కామారెడ్డి జిల్లాలో 22 జెడ్పిటీసీ స్థానాలకు గానూ.. టీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 8 స్థానాలు కైవసం చేసుకున్నాయి.

పెద్దపల్లి జిల్లాలో మొత్తం ఎంపిటీసీలు 138. అందులో టీఆర్ఎస్ 89, కాంగ్రెస్ 33, బీజేపీ 6, ఇతరులు 10 స్థానాలు కైవసం చేసుకున్నాయి

కొమరం భీం జిల్లాలో జెడ్పిటీసీ ఫలితాల్లో 2 స్థానాలు టీఆర్ఎస్ కైవసం

పెద్దపల్లి జిల్లాలో మొత్తం 13 జెడ్పిటీసీ స్థానాలకు గానూ.. 11 టీఆర్ఎస్, 2 సీట్లలో కాంగ్రెస్ విజయం

నిజామాబాద్ జిల్లాలో 27 జెడ్పిటీసీ స్థానాలకు గానూ మాక్లూర్ ఏకగ్రీవం. మిగిలిన వాటిలో 14 స్థానాల్లో టీఆర్ఎస్.. 2 స్థానాల్లో కాంగ్రెస్, ఒక్క స్థానంలో బీజేపీ అభ్యర్థి విజయం

మహబూబాబాద్ జిల్లా శీత్లా తండాలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ ఎంపీటీసీ అభ్యర్థి రోజా గెలుపు

మెదక్ జిల్లా మనోహరాబాద్లో ఎంపీటీసీ అభ్యర్థులను క్యాంపునకు తరలిస్తుండగా తోపులాట.. లింగారెడ్డిపేట టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి నవనీతకు అస్వస్థత.

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం డిచ్చల్లి జెడ్పిటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థి ఇందిరా లక్ష్మీ నరసయ్య విజయం

మంచిర్యాల జిల్లా భీమారంలో జెడ్పిటీసీగా టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి భూక్యా తిరుమల గెలుపు

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం ఖానాపూరంలో కాంగ్రెస్ కార్యకర్తలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి

కోదాడ జెడ్పిటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థిని శేషు కుమారి గెలుపు

కామారెడ్డి జిల్లాలో 14 స్థానాల్లో టీఆర్‌ఎస్, 8 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు

జనగామ జిల్లా జెడ్పిటీసీ ఫలితాల్లో రెండు స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు

ములుగు జిల్లా జెడ్పిటీసీ ఫలితాల్లో 3 స్థానాల్లో టీఆర్ఎస్, ఒక స్థానంలో కాంగ్రెస్ గెలుపు

ములగు జిల్లా జెడ్పిటీసీ ఫలితాల్లో 3 స్థానాల్లో టీఆర్ఎస్, ఒక్క స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.

ఖమ్మం: కూసుమంచి మండల జెడ్పిటీసీగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇంటూరి బేబి గెలుపు

మహబూబాబాద్ జిల్లా జెడ్పిటీసీ ఫలితాలు: ఒక్క సీటును గెలిచిన టీఆర్ఎస్

వరంగల్ జిల్లా జడ్పిటీసీ ఫలితాలు.. వరంగల్ అర్బన్-(6) టీఆర్ఎస్-02,కాంగ్రెస్-00. వరంగల్ రూరల్-(16) టీఆర్ఎస్-02, కాంగ్రెస్-00 గెలుపు

మెదక్ జిల్లా తూప్రాన్ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. గెలిచిన అభ్యర్థిని అపహరించేందుకు మరోవర్గం ప్రయత్నించింది. ఈ క్రమంలో ఒకే పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది.

కరీంనగర్ జిల్లాలో 15 జడ్పీటీసీ స్థానాలకు 10 జడ్పీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు మరో ఐదు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచే అవకాశం

వేలేరు జడ్పీటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థిని చాడ సరిత 3,007 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

గజ్వేల్ నియోజకవర్గంలో మొత్తం 64 ఎంపీటీసీ స్థానాలకు గాను టిఆర్ఎస్ 43, కాంగ్రెస్ 12, స్వతంత్ర అభ్యర్థులు 8, ఏకగ్రీవం 1 స్థానాల్లో గెలుపు

ఇప్పటివరకు 3,873ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు వెల్లడి. అందులో టీఆర్ఎస్- 2,449, కాంగ్రెస్ – 839, బీజేపీ – 158, టీడీపీ -18, వామపక్షాలు, ఇతరులు – 380 స్థానాల్లో గెలుపొందారు.

నిజామాబాద్ జిల్లాలో మొత్తం 286 ఎంపీటీసీ స్థానాలకు గానూ.. 151 టీఆర్ఎస్, 23 బీజేపీ, 44 కాంగ్రెస్, 13 ఇండిపెంటెండ్ అభ్యర్థుల గెలుపు

కామారెడ్డి జిల్లాలో మొత్తం 236 స్థానాలకు గానూ 149 టీఆర్ఎస్, 62 కాంగ్రెస్, 4 బీజేపీ, ఇండిపెంటెండ్ 21 అభ్యర్థులు గెలుపు

కరీంనగర్ జిల్లాలో ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 99, కాంగ్రెస్ 26, బీజేపీ 15, సీపీఐ 3, టీఆర్ఎస్ రెబల్ 2, టీడీపీ 1, ఇండిపెంటెండ్ 31 , ఇతరులు ఒక్క స్థానంలో గెలుపు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండలం పరిధిలో 11ఎంపీటీసి స్థానాలకు కు గాను 5 కాంగ్రెస్, 5 టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాదించగా.. ఒక్క స్థానంలో ఇండిపెంటెండ్ అభ్యర్థి విజంయ సాధించారు.

టెక్మాలమండలంలో మొత్తం 10 ఎంపీటీసీలకు 7 స్థానాలు కాంగ్రెస్, 3 స్థానాలలో టీఆర్ఎస్ విజయం

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రీ ఎంపీటీసీ స్థానానికి టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. ఇద్దరు అభ్యర్థులకు 690 చొప్పున ఓట్లు పోలయ్యాయి. డ్రా తీయగా బీజేపీ అభ్యర్థి ఎర్రవ్వ విజయం సాధించారు.

మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత స్వగ్రామమైన పోతంగల్లో ఎంపీటీసీగా బీజేపీ అభ్యర్థి విజయం. టీఆర్ఎష్ అభ్యర్థిపై 95 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి గెలుపు

రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు 1,040 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు వెల్లడయ్యాయి. అందులో టీఆర్ఎస్ – 695, కాంగ్రెస్ – 205, బీజేపీ – 40, టీడీపీ – 6, వామపక్షాలు – 5, ఇతరులు – 89 మంది అభ్యర్థులు గెలుపొందారు.

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత గ్రామమైన తిరుమలగిరి మండల్ తాటిపాముల గ్రామంలో కాంగ్రెస్ ఎంపీటీసీ గెలుపు

మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట్ మండలం కొత్తూరు ఎంపీటీసీ స్థానంలో 34ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి టేకుమాట్లా తార గెలుపు

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రామంతపూర్ ఎంపీటీసీ స్థానంలో 612 ఓట్లతో టీఆర్ఎస్ గెలుపు, కనిమెట్ట ఎంపీటీసీ స్థానంలో 634 ఓట్లతో టీఆర్ఎస్ గెలుపు

చివ్వేంల మండలం తిమ్మాపురం ఎంపీటీసీ స్థఆనంలో 803 ఓట్లతో కాంగ్రెస్ గెలుపు

సూర్యాపేట జిల్లా మునగాల మండలం నారాయణ గూడెం ఎంపీటీసీ స్థానంలో 12 ఓట్లతో సిపిఎం గెలుపు

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రామన్నగూడెం ఎంపీటీసీ స్థానంలో 163 ఓట్లతో బీజేపీ అభ్యర్థి అంబోతు రవీందర్ గెలుపు

సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం తిమ్మాపురం ఎంపీటీసీ స్థానంలో 803 ఓట్లతో కాంగ్రెస్ గెలుపు

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగుడెం గ్రామం ఎంపీటీసీ స్థానంలో 1048ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి పుచ్చకాయలు లక్ష్మీ గెలుపు

ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం లచ్చన్నగూడెం గ్రామంలో ఎంపీటీసీ స్థానంలో వెయ్యి ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి నాగేశ్వరరావు గెలుపు

మహబూబాబాద్ మండలం ఈదులపూసపల్లి శివారు సిత్ల తండాలో ఒక్క ఓటు తో కాంగ్రెస్ గెలుపు,రీకౌంటింగ్ చేయాలంటూ ఏజెంట్ల డిమాండ్

వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావు పేట మండలం బొజేరువు ఎంపీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్

వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలం రాజుపేట్ ఎంపీటీసీ స్థానంలో కాంగ్రెస్ గెలుపు

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లు ఎంపీటీసీ స్థానంలో కాంగ్రెస్ గెలుపు

యాదాద్రి జిల్లా సర్వేల్ 1 ఎంపీటీసీ స్థానంలో టీఆర్ఎస్ విజయం

సూర్యాపేట మండలం పిన్నాయి పాలెం ఎంపీటీసీ స్థానంలో 196 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి పుప్ఫల లక్ష్మమ్మ గెలుపు

సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం హనుమాన్ నగర్ ఎంపీటీసీ స్థానంలో 63ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మీ గెలుపు

సీఎం దత్తత గ్రామం అయిన మర్కుక్ మండలం ఎర్రవల్లి ఎంపీటీసీ స్థానంలో టీఆర్ఎస్ గెలుపు

బోధన్ మండలం సాలురా 2 ఎంపీటీసీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి 3 ఓట్లతో విజయం..రీకౌంటింగ్‌కు వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్ధి

నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం హనుమాన్‌పల్లిలో స్వతంత్ర అభ్యర్థి గెలుపు

నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం చర్లపల్లి ఎంపీటీసీ స్థానంలో బీజేపీ గెలుపు

నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం చిన్న జెట్రం ఎంపీటీసీ స్థానంలో టీఆర్ఎస్ గెలుపు

నారాయణ పేట జిల్లా నారాయణ పేట మండలం కోటకొండ ఎంపీటీసీ స్థానంలో బీజేపీ గెలుపు

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంట ఎంపీటీసీ స్థానంలో టిఆర్ఎస్ అభ్యర్థి 53 ఓట్లతో గెలుపు

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి ఎంపీటీసీ స్థానంలో 1217 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు

రఘునాథపల్లి మండలం లని శివాజీనగర్ ఎంపీటీసీ ఫలితాల్లో 171ఓట్లతో టీఆర్ఎస్‌ అభ్యర్థి బొల్లపల్లి సరోజన విజయం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్ళపళ్ళి మండలం అనంతోగు ఎంపీటీసీ టీఆరెఎస్ అభ్యర్థి మంజుభార్గవి గెలుపు

కొణిజర్ల మండలం 15ఎంపిటీసీ స్థానాలకు గాను ఉప్పలచెలక టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి బాలాజీ నాయక్ 200 మెజార్టీతో గెలుపు

కామారెడ్డి జిల్లా ఎంపీటీసీ ఫలితాల్లో 28 స్థానాల్లో టీఆర్ఎస్, ఒక స్థానంలో కాంగ్రెస్ ముందంజ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎంపీటీసీ ఫలితాల్లో 12 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోన్న టీఆర్ఎస్

మండల పరిషత్‌ ఎన్నికల్లో 180 స్థానాల్లో టీఆర్ఎస్, 3 స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో బీజేపీ, 3 స్థానాల్లో ఇతరులు ముందంజ

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో లెక్కింపును బహిష్కరించిన శేకాపూర్ ఏజెంట్లు. పోలైన వాటికంటే లెక్కింపులో 2 ఓట్లు అధికంగా రావడంతో కౌంటింగ్ బహిష్కరణ.

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బుడిమి ఎంపీటీసీగా టీఆర్ఎస్ అభ్యర్థి నర్వ రుక్మిణి విజయం. 112 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన నర్వ రుక్మిణి

జనగామ కేంద్రంలో ఓట్ల లెక్కింపు చేస్తుండగా అస్వస్థతకు గురైన సిబ్బంది.. వెంటనే ఆసుపత్రికి తరలింపు.

జయశంకర్ భూపాలపల్లి మహదేవపూర్ మండలం అంబటిపల్లి సూరారంలో చెదలు పట్టిన ఎంపీటీసీ బ్యాలెట్ పేపర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎంపీటీసీ ఫలితాల్లో ఒక స్థానంలో టీఆర్ఎస్, రెండు స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ

ఖమ్మం జిల్లా ఎంపీటీసీ ఫలితాల్లో ఆరు స్థానాల్లో టీఆర్ఎస్ ముందంజ

నల్గొండ జిల్లా జెడ్పిటీసీ ఫలితాల్లో ఒక స్థానంలో టీఆర్ఎస్ ముందంజ

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగి ఆర్ఆర్ఎస్ కళాశాలలో నిలిచిపోయిన కౌంటింగ్

భువనగిరి కేంద్రంలో అరగంట ఆలస్యంగా ప్రారంభమైన లెక్కింపు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ లెక్కింపు కేంద్రానికి ఇంకా చేరుకోని కొన్ని బ్యాలెట్ పత్రాలు

విద్యుత్ సరఫరా లేకపోవడంతో సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలో ఓట్ల లెక్కింపు నిలిపివేత

జగిత్యాల ఎంపీటీసీ ఫలితాల్లో రెండు స్థానాల్లో టీఆర్ఎస్ ముందంజ