చర్చలు విఫలం .. ఈ నెల 9 వరకు బంద్ కొనసాగుతుంది ?

Tuesday, March 6th, 2018, 12:16:10 AM IST


డిజిటల్ ప్రొవైడర్స్ చార్జీల మోతతో నిర్మాతలు, అటు డిస్ట్రబ్యూటర్స్ తీవ్రంగా నష్టపోతున్నారని ఈ నెల 2 నుండి థియేటర్స్ బంద్ కు సౌత్ ఇండియాన్ సినిమా పరిశ్రమ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయం పై నిర్మాతలు , డిస్ట్రిబ్యూటర్స్ కలిసి సర్వీస్ ప్రొవైడర్స్ తో చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో నిర్మాతలు 25 పర్సెంట్ రేట్స్ తగ్గించాలని డిమాండ్ చేస్తే .. వాళ్ళు మాత్రం కేవలం 16 పర్సెంట్ మాత్రమే తగ్గిస్తామంటూ మంకుపట్టు పట్టి కూర్చున్నారు. మొత్తానికి వీరిద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడమతొ ఈ బంద్ ఇంకా కొనసాగేలా ఉంది. మళ్ళీ రెండు రోజుల తరువాత జరిగే మీటింగ్ లో అయినా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ దిగి వస్తారేమో చూడాలి. ఇప్పటికైతే ఈ బంద్ ఈ నెల 9 వరకు కొనసాగుతుందని తెలిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 1700 థియేటర్స్ లలో సినిమాలు ప్రదర్శించడం లేదు.