‘భరత్’ తో అప్పుడు తమ్ముడు, ఇప్పుడు అన్న!

Wednesday, April 18th, 2018, 06:03:37 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో అన్నదమ్ములయిన మన నందమూరి హీరోలు భరత్ అనే నేనుతో ఒక గమ్మత్తైన అనుబంధం కలిగివున్నారు. ఇటీవల ఈ నెల 7న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం లో ఈ సినిమా ఆడియో వేడుక ఎంతో సంబరంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ విచ్చేసిన విషయం విదితమే. అయితే ఈవిధంగా ఒక స్టార్ హీరో సినిమా ఆడియో ఫంక్షన్ కి మరొక స్టార్ హీరో రావడమనేది నిజంగా గొప్ప విషయమని పలువురు ఇండస్ట్రీ వారు అభినందిస్తున్నారు.

అయితే ఇప్పుడు ఆయన అన్న కల్యాణ రామ్ భరత్ తో మరొక విధంగా అటాచ్మెంట్ పెట్టుకోనున్నారు. అది ఎలా అంటే ఇటీవల జయేంద్ర దర్శకత్వం లో కల్యాణ రామ్, తమన్నా కలయికలో వస్తున్న నా నువ్వే సినిమా టీజర్ విడుదలయి మంచి పేరు సంపాదించింది. కాగా ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ ని భరత్ అనే నేను ప్రదర్శించే థియేటర్ లలో ప్రదర్శించనున్నారట. కనుక ఈ విధంగా పరోక్షంగా భరత్ తో నందమూరి హీరోలు టై అప్ అయ్యారన్నమాట……

  •  
  •  
  •  
  •  

Comments