ఈ విశ్వం లో దేవుడు లేడు…

Tuesday, November 13th, 2018, 09:38:40 PM IST

దేవుడనే వాడే లేడు. విశ్వ సృష్టికర్త కూడా లేదు. మానవ భవిష్యత్తు ని ఎవరు శాసించలేరు. భూమిని వీడటం తప్ప మానవాళికి మరో మార్గం లేదు. వాతావరణ మార్పులు సృష్టించే విపత్తు తెలిసే సరికి సమయం మించిపోతుంది. మరో 50 ఏళ్లలో జీవం పుట్టుక పై మరిన్ని విషయాలు తెలుస్తాయన్నారు హాకింగ్. నాలాంటి దివ్యంగులకి దేవుడి శాపమే కారణమని నమ్ముతున్న జనాలకి నిజం తెలిసేందుకు ఎంతో సమయం పట్టదు. మనలో ఎదురవుతున్న ప్రతి ప్రశ్న కి ఒక సమాధానం లభిస్తుంది. ప్రకృతి దర్మాల ప్రకారమే సృష్టి నడుస్తుంది. ప్రతి ప్రశ్న కి శాస్త్రీయ శాస్త్రీయ కోణంలో వివరణ ఇవ్వడమే మేధో దైవత్వం. ఈ శతాబ్దం పూర్తయ్యే సరికి దైవత్యం గురించిన పూర్తీ నిజం మానవుకి తెలుస్తుంది. ఈ విషయాలు ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, దివంగత స్టీఫెన్ హాకింగ్ తన చివరి పుస్తకంలో మానవాళిని ఉద్దేశించి చేసిన వాఖ్యలు.

మరణానంతరం స్వర్గం, నరకం వంటివి ఏమి ఉండవని, మరణాంతర జీవితం అంటే కోరికలతో నిండిన ఆలోచనలని చెప్పేందుకు ఆధారాలు లేవని కూడా ఆయన తన పుస్తకంలో రాసారు. భూమిని వీడటం తప్ప మానవాళికి మరో మార్గం లేదని, భూమిని వీడకుంటే మానవులంతా అంతరించిపోతారని ఆయన అంచనా వేశారు. మరో 100 సంవత్సరాల్లో మనిషి మేధస్సుని కంప్యూటర్లు మించిపోనున్నాయని, మానసిక, శారీరక లక్షణాలను మెరుగుపరచుకోవడం తప్ప మానవాళి ముందు మరో మార్గం లేదని హెచ్చరించారు. జన్యు మార్పులతో సూపర్ హుమాన్ లను సృష్టిస్తే పెను ప్రమాదం ఉందని కూడా అంచనా వేశారు. వాతావరణ మార్పులు ఎటువంటి విపత్తును తీసుకురానున్నాయన్న విషయం ప్రజలకి తెలిసేసరికి చాల ఆలస్యం అయిపోతుందని, మరో 50 సంవత్సరాల్లో జీవం పుట్టుక, ఇతర గ్రహాల మీద జీవుల మనుగడపై అన్ని విషయాలు అవగతమవుతాయని స్టీఫెన్ హాకింగ్ తను చివరగా రాసుకున్న పుస్తకంలో వ్యాఖ్యానించారు.

  • 2
  •  
  •  
  •  

Comments