అక్కడ కలెక్షన్ల దుమ్ము దులిపిన సూర్య!

Friday, May 18th, 2018, 05:41:44 PM IST

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా రచయిత వక్కంతం వంశి తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఈ చిత్రంలో ఆర్మీ లో చేరి బోర్డర్ లో దేశానికి సేవలందించాలనే తపన వున్న ఒక సైనికుడిగా అల్లు అర్జున్ నటన నిజంగా అద్భుతమని చెప్పుకోవాలి. అయితే దర్శకుడు ఆ పాయింట్ ని పూర్తి చిత్రంగా తీయడంలో విఫలమయ్యాడనే చెప్పుకోవాలి. కాగా ఎన్నో అంచనాల మధ్య విడుదలయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమయింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్టాలు, ఓవర్సీస్ సహా ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ నష్టాన్ని చవిచూసే అవకాశాలు భారీగా కనపడుతున్నాయి. ఆ విషయం అటుంచితే, అల్లు అర్జున్ కు తెలుగు తోపాటు మలయాళం లో కూడా అభిమానులు ఎక్కువమంది వున్నారు. అంతే కాదు ఇక్కడ ప్లాప్ అయిన ఆయన చిత్రాలు మలయాళంలో మంచి సాధించిన సందర్భాలు లేకపోలేవు.

అందుకే ఆయన్ను అందరూ అక్కడ మల్లు అర్జున్ అని కూడా పిలుస్తుంటారు. ప్రస్తుతం ఆయన నటించిన నా పేరు సూర్య చిత్రం అక్కడ ‘ఎండె పేరు సూర్య ఎండె వీడు ఇండియా’ పేరు తో విడుదలయి అదిరిపోయే కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటికే అక్కడ ఈ చిత్రం 80కి పైగా థియేటర్లలో ఆడుతూ దాదాపు రూ.5 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇది ఒకరకంగా మలయాళంలో ఒక డబ్బింగ్ చిత్రం సాధించిన ఘనవిజయంగా చెపుతున్నారు. ఇక్కడ ఈ చిత్రం పెద్దగా అదనప్పటికీ మలయాళంలో దుమ్మురేపుతుండడంతో యూనిట్ కూడా చాలా సంతోషంగా ఉన్నారట. అంతే కాదు ఇదివరకు అల్లు అర్జున్ నటించిన సరైనోడు చిత్రం కూడా మల్లువుడ్ లో రూ.7 కోట్లు కలెక్షన్లు కొల్లగొట్టి మంచి రికార్డు సాధించిన విషయం తెలిసిందే…..