చంద్రబాబు : ఇవి కృత్రిమం గా వచ్చిన వరదలు

Tuesday, August 20th, 2019, 07:58:26 PM IST

పూర్తీగా విఫలమైన ప్రభుత్వం, వరద సహాయక చర్యలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆరోపించారు. నీటి నిర్వహణలో ముందు జాగ్రత్త చర్యలేవి తీసుకోలేదని వైయస్ జగన్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. విజయవాడ తూర్పు నియోజక వర్గంలో కృష్ణ కరకట్ట వద్ద సందర్శించిన చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. కరకట్ట రక్షణ గోడ నిర్మాణం పూర్తీ చేయాలనీ యస్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

ఇళ్లను కోల్పోయిన బాధితులకు ఇళ్ల పట్టాలను అందించాల్సిందిగా డిమాండ్ చేసారు. ఈ వరదలను తన ఇంటి కోసం సృష్టించినవని, కానీ ప్రజల ఇళ్లను, పంటలను వరదలతో ముంచేశారని మండి పడ్డారు. ఇవి కృత్రిమ వరదాలని పేర్కొంటూ జగన్ ప్రభుత్వ నిర్లక్ష్య దొరణని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇకనైనా బాధితులను ఆదుకోవాలి అని, పునరావాస ప్రాంతాలకు కాకుండా వీరికి ఇళ్ల పట్టాలను అందించాలని అన్నారు. రాష్ట్రంలో ఇసుక దొరకదు, అన్నా కాంటీన్ లు తెరవరు అంటూ అధికార పార్టీ పై ధ్వజమెత్తారు.