ఏపీ హోంమంత్రి ముందున్న సవాళ్లు ఇవే – ధీటుగా ఎదుర్కుంటుందా…?

Friday, June 14th, 2019, 12:00:24 AM IST

ఏపీకి కొత్త హోంశాఖ మంత్రి గా ప్రమాణస్వీకార చేసినటువంటి మేకతోటి సుచరిత పొలిసు శాఖను గాడిలో పెట్టె ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. అందుకు గాను కొన్ని సవాళ్ళను ఎదురుకోవాల్సి ఉంది. కాగా గత ప్రభుత్వంలో ఉన్న మొత్తం పోలీసు శాఖా మొత్తం కూడా అధికార పార్టీ కి అనుకూలంగానే పని చేసిందని వార్తలు వస్తున్నాయి కాగా ఫిర్యాదులు చేసిన వారిపైనే ఎదురు కేసులు పెట్టి వేధించిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి… అంతేకాకుండా గత ప్రభుత్వంలో మహిళలపై వేడంపులు చేసిన వారిపై ప్రస్తుత హోంశాఖ మంత్రి చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారని ప్రజలు ఆశిస్తున్నప్పటికీ కూడా ఎలాంటి వార్తలు కూడా అధికారికంగా రావట్లేదని అందరు అంటున్నారు. అంతేకాకుండా M.R.O వనజాక్షి పై దాడి, నాగార్జున యూనివర్శిటీలో వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి కేసు, వడ్డీడికి డబ్బులిచ్చి మహిళల మానంతో చెలగాటమాడిన కాల్ మనీ సెక్స్ రాకెట్ వ్యవహారం, అనంతపురంలో పరిటాల, జేసీ కుటుంబాలు మహిళలపై బహిరంగంగా దాడిచేసిన సంఘటనల్లాంటి ఉదాహరణలు ఉన్నాయి. వీటన్నింటిని కూడా హోంమంత్రి సుచరిత ఎలా పరిష్కరిస్తుందో అని నేతలతో పాటే అందరు ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

గత ప్రభుత్వంలో మహిళలపై చాలా దాడులు జరిగాయి. కాగా ఆదాడులపై మునుపటి ప్రభుతం మరియు పోలీసులు అసలే చర్యలు తీసుకోలేకపోయారని చాలా అభియోగాలున్నాయి. అయితే నేటి ప్రభుత్వంలో మహిళా హోమ్ శాఖా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో గతంలోని సమస్యలన్నింటిని పరిష్కరిస్తుందని, కాగా తనముందున్న సవాళ్ళను ఎలా ఎదుర్కొంటుంది అని అందరు కూడా ఆలోచిస్తున్నారు.