బ్రేకింగ్ న్యూస్ : గత 24 గంటల్లో ఏపీలో కరోనా లెక్కలు ఇవే.!

Thursday, May 28th, 2020, 12:07:57 PM IST


ఇప్పుడు ఏపీలో కరోనా పరిస్థితి ఏమాత్రం అర్ధవంతంగా లేదని చెప్పాలి. దేశంలోనే అత్యధిక కేసులతో ముందంజలో ఉన్నా వాటిని సమర్ధవంతంగా ఆదుకోవడంలో మాత్రం కాస్త వైఫ్యలం చెందుతుంది అని చెప్పాలి.

అందుకు తగ్గుతుంది అనుకున్న కరోనా కాస్తా ఇప్పుడు ఏమాత్రం తగ్గడం లేదు. అంతే స్థాయిలో తగ్గుతూ పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు గత 24 గంటల్లో నమోదు కాబడిన కరోనా లెక్కలను వెల్లడించారు.

గత 24 గంటల్లో 9858 శాంపిల్స్ ను పరీక్షించగా అందులో 54 మందికి కరోనా ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది. అలాగే నిన్న ఒక్క రోజులోనే 45 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని డిశ్చార్జ్ కాగా కర్నూలు జిల్లాలో ఒకరు మరణించారు. ఈ కొత్తగా నమోదు కాబడిన 54 కేసులతో ఏపీలో మొత్తం 2841 కి కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.