లాక్‌డౌన్‌లో ఎక్కువగా డౌన్‌లోడ్ చేసిన యాప్స్ ఇవే..!

Friday, May 22nd, 2020, 02:42:54 AM IST

ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అన్ని దేశాలు లాక్‌డౌన్ పాటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దాదాపు రెండు నెలలుగా లాక్‌డౌన్ పాటిస్తున్నా కరోనా కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు.

అయితే లాక్‌డౌన్ సమయంలో పనులు లేక, ఉద్యోగాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ లాక్‌డౌన్ పీరియడ్‌లో ప్రజలు బోరింగ్‌గా ఫీలవ్వకుండా ఎక్కువగా స్మార్ట్ ఫోన్‌తోనే గడపారు. అయితే ఈ మొత్తం లాక్‌డౌన్ పీరియడ్‌లో ఎక్కువ మంది డౌన్‌లోడ్ చేసిన యాప్‌లు ఆరోగ్య సేతు, లుడో కింగ్, జూమ్ యాప్, టిక్‌టాక్, క్యారమ్ పూల్, యూ వీడియో, గూగుల్ పే, వాట్సాఫ్, ఇన్‌స్టాగ్రామ్ లు వరుసగా ఉన్నాయి.