బిగ్ న్యూస్ : రాజు రవితేజ “జనసేన” వదలడానికి అసలు కారణం ఇదే.!?

Saturday, December 14th, 2019, 09:00:04 AM IST

ఏపీ రాజకీయ వర్గాల్లో జనసేన పార్టీ ప్రస్తుతం ఖచ్చితంగా ఓ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే ఎన్నికల్లో మాత్రం అంతగా ప్రభావం చూపకపోవడంతో పార్టీలో ఉన్న ఆశావాదులు ఎవరో పవన్ తెలుసుకున్నారు.తాను ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే తనతో ఉండే వాళ్ళు ఉంటే మంచిది అలా కాదని తనని విడిచి వెళ్ళిపోతే మరీ మంచిది అని పవన్ ఎప్పుడో చెప్పేసారు.అలాంటి సమయంలోనే కదా తన చుట్టూ ఎలాంటి వారు ఉన్నారో తెలుసుకోగలను అని అన్నారు.అయితే ఇతర పార్టీలతో పోలిస్తే జనసేన పార్టీను వీడిన వారి సంఖ్య తక్కువే అయినా కాస్త కీలకమైన వారే జనసేన పార్టీను వీడారు.

కానీ ఇప్పుడు పవన్ కోసం ఇంత నిశితంగా ఎవరు మాట్లాడరేమో అతని సన్నిహితుల్లో కూడా చాలా మందికి పవన్ కోసం తెలియనన్ని విషయాలను రాజు రవితేజ అనే వ్యక్తి చెప్తే పవన్ అభిమానులు గతంలో ఆశ్చర్యం వ్యక్తం చేసారు.అలాంటి వ్యక్తే ఇప్పుడు జనసేన పార్టీను వీడినట్టుగా నిన్న వార్త వచ్చేసరికి చాలా మందికి మొదట ఏమీ అర్ధం కాలేదు.పవన్ పేరు ప్రస్తావించకుండా ఏవేవో చెప్తుండడం కాస్త అయోమయానికి గురి చేసింది.తర్వాత పార్టీ నుంచే ఒక క్లారిటీ ఇవ్వడంతో అంతా సర్దుమణిగింది.కానీ పవన్ కు అత్యంత ఆప్తుడు సన్నిహితుడు అయిన ఈయన ఎందుకు పార్టీ వీడారో అన్నదానికి కొన్ని సమాధానాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

రాజు రవితేజ రాజీనామాను పవన్ ఆమోదిస్తూ ఆ “జగన్”మాత ఆశీస్సులు ఉండాలని పరోక్షంగా ఓ పార్టీ నాయకుని పేరును చెప్పడమే కాకుండా ఈ వ్యక్తి కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వ్యక్తిని అందులో భాగంగానే అప్పుడు పవన్ కమ్యూనిస్టులతో కలిసినపుడు పార్టీలోకి వచ్చాడని ఇప్పుడు వారితో దూరంగా ఉండి బీజేపీకి దగ్గరవుతున్నారన్న అనుమానంతో పవన్ మత విద్వేషాలు రెచ్చగొడతాడని ఏదేదో చెప్తూ పవన్ పై సంచలన ఆరోపణలు చేస్తూ వెళ్లిపోయాడని మరికొందరు అంటున్నారు.