బ్రేకింగ్ : అమిత్ షాతో మీటింగులో జగన్ లేవనెత్తిన అంశాలు ఇవే.!

Friday, June 14th, 2019, 07:27:49 PM IST

వైసీపీ అధినేత మరియు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ రేపు ఢిల్లీలో జరగబోయే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు అయ్యేందుకు ఈ రోజు ఢిల్లీ వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే.అందులో భాగంగా జగన్ ఈ రోజు కేంద్ర హోమ్ శాఖా మంత్రి అయినటువంటి అమిత్ షా ను కలిసారు.ఆయన్ను కలిసిన అనంతరం జగన్ మీడియా ముందుకొచ్చి తాను ఏయే అంశాలపై చర్చలు జరిపారో తెలియజేసారు.

తాను అమిత్ షాతో రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కోసం అలాగే విభజన హామీల అమలుకు సాధ్యమయ్యే మార్గాల కోసమే చర్చలు జరిపానని,ఈ విషయంలో ప్రధాన మంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ మనసు కరిగించమని తన వంతుగా విన్నవించుకున్నానని తెలియజేసారు.ఇలా సమయం దొరికిన ప్రతీ సారి కూడా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కోసం ఎల్లప్పుడూ లేవనెత్తుతూ ఉంటానని రేపు జరగబోయే నీతి ఆయోగ్ మీటింగ్ లో కూడా తప్పకుండా లేవనెత్తుతానని జగన్ తెలియజేసారు.