అడ్డంగా దొరికేసిన విజయసాయి రెడ్డి..వైసీపీ భాగోతం ఇదా.!

Monday, August 12th, 2019, 05:59:44 PM IST

రాజకీయాల్లో ఉన్నపుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో వారికే అన్ని సదుపాయాలు అంది వ్యతిరేఖ పార్టీల వారు అయితే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్న పాలిటిక్స్ చూస్తున్నాం తప్ప అందరికి సమ న్యాయ పాలన జరుగుతున్న దాఖలాలు అయితే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కనిపించడం లేదు.ఇప్పుడు ఇదే బాటలోనే వైసీపీ కూడా నడుస్తుందని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డే స్వయంగా సెలవిచ్చి అడ్డంగా దొరికారు.

వారి పార్టీకు సంబందించిన వారికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని అన్ని సదుపాయాలు వారికే దక్కే విధంగా వారి ప్రభుత్వం ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేసిందని విజయసాయి రెడ్డే చక్కగా సెలవిచ్చారు.అసలు ఈ భాగోతం అంతా ఎలా బయటకొచ్చింది అంటే..ఇటీవలే సోషల్ మీడియా విభాగంతో విజయసాయి రెడ్డి ఒక మీటింగు నిర్వహించారు.ఈ మీటింగులో మాట్లాడుతున్న మాటలను వీరి బండారాన్ని జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సందీప్ పంచకర్ల తన ట్విట్టర్ ఖాతా ద్వారా బయటపెట్టారు.

వైసీపీ కోసం ప్రత్యేకంగా పని చేసిన వారికి రిజర్వేషన్లు కల్పించాలని చాలా మంది కోరారని కానీ అది వీరు కానీ స్వయంగా తీసుకొస్తే చట్ట విరుద్ధం అని చెప్పి న్యాయస్థానం కొట్టేస్తుందని అందుకు బదులుగా వైసీపీ కోసం కష్టపడిన వారికి మాత్రమే ప్రభుత్వ కొలువులు వచ్చేలా ఇంటర్వ్యూలు ఏర్పాటు చేస్తున్నామని దానికి సంబంధించి అన్ని పూర్తి కావస్తున్నాయని స్వయంగా విజయసాయి రెడ్డే తెలిపారు.

ఇదేమి జగన్ కు తెలీకుండా జరగడం లేదు అనుకుంటే పొరపాటే అవుతుంది.ఇంత పెద్ద మీటింగు కోసం జగన్ కు తెలీకుండా ఉంటుందా ఏమిటి కానీ..జగన్ ఏమో పైకి సమన్యాయ పాలన అందరు ఒకటే వాళ్ళు ఎక్కువ కాదు తక్కువ కాదు అని చెప్తూనే వారి పార్టీలో లోలోపల మాత్రం ఇలా గుట్టుగా అన్ని జరిపిస్తున్నారు.