వైసీపీలో టెన్షన్ టెన్షన్..ఆ ఇద్దరి విషయంలో జగన్ ఫైనల్ డెసిషన్ తీసుకున్నారా?

Saturday, June 1st, 2019, 03:06:24 PM IST

ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో జగన్ తన క్యాబినెట్ లో మంత్రులుగా ఎవరెవరికి చోటు కల్పిస్తారు? ఎవరిపై వేటు వేస్తారు,అసలు జగన్ నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతుంది అని వైసీపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారట.ఇప్పటికే జిల్లాల వారీగా ఎవరెవరు మంత్రి పదవుల రేస్ లో ఉన్నారో మనం చర్చించుకున్నాము.వారిలో ఇప్పుడు జగన్ ఒక ఇద్దరికి షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో అంతర్గత సమాచారం.ప్రస్తుతానికి జగన్ క్యాబినెట్ లో చిత్తూరు జిల్లా నుంచి మరియు గుంటూరు నుంచి రోజా మరియు అంబటి రాంబాబు ల పేర్లు కూడా వినపడ్డాయి.

ఇప్పుడు ఈ ఇద్దరికీ జగన్ అవకాశం ఇచ్చే సూచనలు అయితే కనిపించట్లేదట.వీరిద్దరూ వైసీపీ కోసం ఎలా పోరాటం చేసారో అందరికీ తెలుసు.వీరిద్దరికీ వైసీపీ ఫైర్ బ్రాండ్స్ అనే పేరు కూడా ఉంది.ఈ కారణం చేతనే జగన్ వీరికి మంత్రి పదవులు ఇవ్వాలా వద్దా అనే యోచనలో ఉన్నారట.వీరి ఇరువురి దూకుడు స్వభావం వలనే జగన్ వీరిద్దరిని దూరం పెట్టాలని అనుకుంటున్నారని అంతేకాకుండా మంత్రి వర్గంలో మొత్తం శాంతి స్వభావం ఉన్న వారినే జగన్ ఎన్నుకోవాలని చూస్తున్నారని అందుకోసమే వీరిద్దరికీ చాన్సులు తక్కువ ఉన్నాయని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది.