భారత్ vs ఆసీస్..ఈ ఇద్దరు బౌలర్లు విజృంభణ మాములుగా లేదుగా.!

Friday, December 28th, 2018, 03:52:20 PM IST

ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియా టూర్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి టెస్టు మ్యాచుల్లో మాత్రం ఈ ఇద్దరు బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్సమెన్లకు చుక్కలు చూపిస్తున్నారు.ఒక పక్క యార్కర్ కింగ్ బుమ్రా కంగారులను కంగారెత్తిస్తే మరో పక్క ఆస్ట్రేలియా పాట్ కమ్మిన్స్ భారత జట్టు ఆటగాళ్లను బెంబేలెత్తిస్తున్నాడు.ప్రస్తుతం జరుగుతున్నటువంటి మూడో టెస్ట్ మ్యాచులో మాత్రం ఇద్దరి ప్రదర్శన కోసం మాట్లాడుకోవాల్సిందే.ఒక పక్క మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో బుమ్రా ఒక్కడే 15.5 ఓవర్లలో 4 మేడిన్లు 6 వికెట్లు పడగొట్టి ఆసీస్ కి చెమటలు పట్టించాడు.

అదే విధంగా ఆస్ట్రేలియాకి చెందినటువంటి పాట్ కమ్మిన్స్ దెబ్బకి మాత్రం మూడో ఇన్నింగ్స్ లో భారత జట్టు ఆటగాళ్లు ముందే చేతులెత్తేశారు.రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మరియు చటేశ్వర్ పుజారాలను ఒక్క పరుగు కూడా తియ్యనివ్వకుండా డక్ అవుట్ చేసి పెవిలియన్ కు చేర్చాడు.దీనితో కమ్మిన్స్ దెబ్బకి 54 పరుగులకే 5 వికెట్లు భారత్ కోల్పోగా అందులో కమ్మిన్స్ కే 4 వికెట్లు వెళ్లిపోయాయి.కమ్మిన్స్ 6 ఓవర్లు వెయ్యగా అందులో 2 మేడిన్ ఓవర్లు 4 వికెట్లు ఉన్నాయి.ఈ మూడో టెస్ట్ లో మాత్రం ఒక పక్క బుమ్రా మరో పక్క కమ్మిన్స్ ల మధ్య పోటీ మాత్రం హోరాహోరీ గానే ఉందని చెప్పాలి.