చంద్రబాబు, నిమ్మగడ్డ దారిలో రఘురామ కృష్ణంరాజు…ఇది జగన్ పై దండయాత్రేనా?

Sunday, June 28th, 2020, 12:39:13 PM IST

సీఎం జగన్ మోహన్ రెడ్డి భారీ మెజారిటీ తో రాష్ట్ర ప్రభుత్వం ను ఏర్పాటు చేసినప్పటి నుండి టీడీపీ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రతి పథకం లో, ప్రతి పనిలోనూ జగన్ అధికార యంత్రాంగం పై విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా రఘురామ కృష్ణంరాజు కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లి తనకు రక్షణ కల్పించాలని కోరడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది అని చెప్పాలి.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక, చంద్రబాబు తనకు రక్షణ లేదు అని కేంద్రాన్ని ఆశ్రయించారు. అయితే న్యాయపరమైన అంశాలలో కూడా చంద్రబాబు విజయం సాధించారు. అయితే ఇదే తరహా లో రాష్ట్ర ఎన్నికల కమిషనర నిమ్మగడ్డ రమేష్ కుమార్ సైతం కేంద్ర ప్రభుత్వం ను రక్షణ కల్పించాలని కోరడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం పట్ల రమేష్ కుమార్ తనకు, తమ కుటుంబానికి ప్రాణ హాని ఉందంటూ కేంద్రం వద్ద తమ గోడు చెప్పుకున్నారు.

అయితే ఇపుడు అదే తరహాలో వైసీపీ నుండి ఎంపీ గా గెలిచిన రఘురామ కృష్ణంరాజు ప్రవర్తిస్తున్నారు. తాజాగా తనకు రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ను కోరడం జరిగింది. ఇందుకు కేంద్ర హోమ్ మంత్రిత్వ కిషన్ రెడ్డి సైతం హామీ ఇచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ల దారిలో రక్షణ కల్పించాలని కేంద్రం వద్ద కి రఘురామ కృష్ణంరాజు వెళ్ళడం సొంత పార్టీ నేతలకు సైతం ఆందోళన కలిగిస్తుంది. అయితే ఇదే అంశం పై మాత్రమే కాకుండా పలు కీలక నిర్ణయాల విషయం లో టీడీపీ, జన సేన, బీజేపీ లు, కొందరు సొంత పార్టీ కి చెందిన నేతలు జగన్ తీరు ను ఎండగడుతూ నే ఉన్నారు.

సీఎం గా 13 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి నుండి సొంత పార్టీ నేత సైతం, ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ను, న్యాయస్థానం ను, పోలీసులను ఆశ్రయించకుండా, కేంద్రం ప్రభుత్వం ను ఆశ్రయించడం పట్ల జగన్ పై వ్యతిరేకత భావం ఎంటో తెలుస్తోంది.