షాకింగ్ : రోజాకు మంత్రి పదవి దక్కకపోవడానికి ఆ ఇద్దరే కారణమా.?

Friday, July 12th, 2019, 09:00:52 AM IST


గత కొన్ని రోజుల క్రితం వైసీపీ పార్టీలో పెద్ద దుమారమే చెలరేగింది.జగన్ ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యాక జగన్ క్యాబినెట్ మంత్రి వర్గంలో ఎవరెవరికి పదవులు దక్కుతాయా అని అంతా అనుకున్న నేపధ్యలో బలంగా వినిపించిన పేరు రోజా.పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి జగన్ వెంటే ఉండి పార్టీ ఫైర్ బ్రాండ్ గా ఆమె పేరు తెచ్చుకున్నారు.దీనితో ఈమె ఇన్నేళ్ల కష్టాన్ని జగన్ గుర్తించి తప్పక మంత్రి పదవి కట్టబెడతారని అంతా అనుకుంటే జగన్ షాకిచ్చే విధంగా ఆమెకు ఎలాంటి మంత్రి పదవిని ఇవ్వలేదు.దీనితో రోజాకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుంది అని భావించిన ప్రతి ఒక్కరికి నిరాశే మిగిలింది.

ఆ తర్వాత రోజా అలక చెందడం దాన్ని కప్పి పుచ్చేందుకు జగన్ మరో ఆఫర్ ఇవ్వడం అన్ని జరిగిపోగా అసలు రోజాకు మంత్రి పదవి దక్కకపోవడానికి ఓ ఇద్దరు వ్యక్తులే ప్రధాన కారణమని రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఓ మాట బయటకు వచ్చింది.సామాజికవర్గం వల్ల రోజాకు పదవి దక్కలేదు అన్న మాట వాస్తవం. అందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుతం జగన్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న ఒక కీలక నేత మరియు మరొకతను రోజా పేరును జగన్ వద్ద ప్రస్తావనకు కావాలనే తీసుకురాకపోవడం అలాగే ఆమె కోసం కాస్త నెగిటివ్ గా చెప్పడం వల్లే జరిగిందని విశ్లేషకులు ఒక సరికొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.మరి రానున్న రెండున్నర ఏళ్ల తర్వాత అయినా రోజాకు మంత్రి పదవి దక్కుతుందేమో చూడాలి.