నమ్ముకున్న వాళ్ళే టీడీపీకి వెన్నుపోటు పొడిచారా.?

Monday, June 3rd, 2019, 05:20:35 PM IST

ఆంధ్ర రాష్ట్ర 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో ఊహించని ఫలితాన్ని చవి చూసిన పార్టీ ఏదన్న ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీయే అని చెప్పాలి.అస్సలు ఇలాంటి ఫలితాలను చూస్తామని కలలో కూడా అనుకోని ఉండరు.మొత్తం 175 స్థానాల్లో ఏమాత్రం పోటీ ఇవ్వని విధంగా కేవలం 23 స్థానాలతో సరిపెట్టుకోవడం చాలా మంది టీడీపీ నేతలకు అస్సలు మింగుడు పడలేదు.అయితే ఫలితాల అనంతరం అసలు వారు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందో అన్నదానికి కనిపించిన అనేక కారణాలలో ప్రధాన కారణంగా చెప్పాలి అంటే ఆ పార్టీని ఎవరైతే గెలిపిస్తారు అని అనుకున్నారో వారే పార్టీని ఓడించేసారని కొంత మంది విశ్లేషకులు అంటున్న మాట.

ఇంకా ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి అన్న సందర్భంలో చంద్రబాబు ప్రవేశ పెట్టిన పసుపు కుంకుమ మరియు పెంచిన ఫించను లెక్కలు వల్ల మహిళలు మరియు వృద్ధ ఓటర్లు అంతా వారి వైపే ఉన్నారు అని అంతా అనుకున్నారు.మరీ ముఖ్యంగా డ్వాక్రా మహిళలు మాత్రమే తెలుగుదేశం పార్టీకు ఓట్లు వేసేసినా టీడీపీకి తిరుగు ఉండదు అని వారు అనుకున్నారు.కానీ సీన్ కట్ చేస్తే వారే వీరికి వెన్నుపోటు పొడిచారని అంటున్నారు.బాబు నుంచి తీసుకోవాల్సిన సదుపాయాలని తీసేసుకొని ఓటు మాత్రం జగన్ కే వేసారన్న టాక్ కూడా ఆ మధ్య వచ్చింది.కానీ తెలుగుదేశం పార్టీ నేతలు అభ్యర్థులు కూడా బహిరంగంగానే తమకి మహిళా ఓటర్లు అండగా ఉన్నారని మా విజయాన్ని ఎవరు ఆపలేరని చాలా నమ్మకాలే పెట్టుకున్నారు.కానీ చివరకు వారే టీడీపీ హ్యాండ్ ఇచ్చారు.