చంద్రబాబు ఏం చేస్తున్నారు – పార్టీ పరిస్థితి ఏంటి…?

Sunday, December 15th, 2019, 10:53:12 AM IST

గతంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఇటీవల ఏపీలో జరిగినటువంటి ఎన్నికల్లో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దారుణమైన ఓటమిని కూడగట్టుకున్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఇకపోతే రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుండి టీడీపీ కార్యకర్తలపై దారుణమైన దాడులు జరుగుతున్నాయన్న సంగతి మనకు తెలిసిందే. కాగా ఏదేమైనప్పటికీ కూడా టీడీపీ పార్టీ కి బలం అంటే కార్యకర్తలే అని చెప్పుకోవాలి. కాగా అలాంటి కార్యకర్తలను రక్షించడానికి చంద్రబాబు మరియు అతని కుమారుడు నారా లోకేష్, వారి కోసం ఏమైనా చేస్తాం అని ప్రకటించారు. కానీ ఇప్పటికి కూడా టీడీపీ కార్యకర్తలను పట్టించుకున్న ఆనవాళ్లు కూడా లేవని స్పష్టంగా అర్థమవుతుంది.

కాగా ఇటీవల చంద్రబాబు నాయుడు ఒక సభలో మాట్లాడుతూ… కార్యకర్తలే పార్టీ కి బలం, వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత మాపై ఉందని కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. ఇకపోతే కార్యకర్తలతో పాటె, పార్టీ అనుబంధ విభాగాలను చంద్రబాబు పట్టించుకోవడంలేదని పలు విమర్శలు వస్తున్నాయి. కాగా తెలుగు యువత కు అధ్యక్షుడు లేడు, మహిళా విభాగానికి అధ్యక్షురాలు ఉన్నప్పటికీ కూడా ఆమె ఎలాంటి కార్యక్రమాల్లో భాగం కాదు. దానికి తోడు మిగిలిన విభాగాలకు మాత్రం ఎవడు ఉన్నారో లేరో కూడా ఇప్పటికి ఒక స్పష్టత మాత్రం లేదని చెప్పాలి. కాగా ఈ విభాగాలకు అందరికి కూడా కొత్త భయాలు మొదలవుతున్నాయి. అసలు ఈ విభాగాలను ఇలాగె కొనసాగిస్తారా లేక మరేదైనా చేస్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కాకపోతే చంద్రబాబు ఈ విభాగాల విషయంలో ఎందుకు ఇంతలా నిర్లక్ష్యం వహిస్తున్నాడో అనేది చర్చనీయాంశంగా మారింది.