సైలెంట్‌గా `ప‌ద్మ‌శ్రీ` నొక్కేసిన‌ న‌టుడు!

Tuesday, April 3rd, 2018, 08:30:49 PM IST

ఇటీవ‌లి కాలంలో ప‌ద్మ పుర‌స్కారాల ప్ర‌క‌ట‌న గురించి తెలిసిందే. లేటెస్టుగా ఓ న‌టుడు సైలెంటుగా ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం అందుకున్నాడు. అత‌డి పేరు మ‌నోజ్ జోషి. బాలీవుడ్‌కి చెందిన ఈయ‌న హంగామా, వివాహ్‌, హ‌ల్‌చ‌ల్‌, బూల్ బుల‌య్యా, భాగం భాగ్‌, ఫిర్ తేరా పెరీ, చుప్ చుప్ కే వంటి క్లాసిక్ మూవీస్‌లో న‌టించాడు. ఆయా చిత్రాల్లో అత‌డికి ఐడెంటిటీ ఉన్న పాత్ర‌లే ద‌క్కాయి. ఇక బుల్లితెర‌పై అత‌డు చేసిన చాణక్య రోల్ అయితే అస్స‌లు మ‌ర్చిపోలేనిది. ద‌శాబ్ధాలుగా అత‌డు ప‌రిశ్ర‌మ‌కు చేసిన సేవ‌ల‌కుగానూ ప్ర‌తిష్ఠాత్మ‌క ప‌ద్మ‌శ్రీ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

మ‌నోజ్ ఈనెల 2న‌ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ చేతుల‌మీదుగా ప‌ద్మ‌శ్రీ పురస్కారం అందుకున్నారు. రాష్ట్ర‌ప‌తిభ‌వ‌న్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మానికి సంబంధించిన వివ‌రాల్ని, ఈ ఫోటోని రాష్ట్ర‌ప‌తి స్వ‌యంగా ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేయ‌డం విశేషం. హిందీ, గుజ‌రాతీ భాష‌ల్లో సినిమాలు చేసిన జోషి ఈ పుర‌స్కారానికి అర్హుడ‌ని ఈ సంద‌ర్భంగా స‌హ‌న‌టులు అభినందిస్తున్నారు.