జనసేనానికి బంగారం లాంటి అవకాశం ఇచ్చిన జగన్..వాడుకుంటారా?

Sunday, September 22nd, 2019, 09:27:53 AM IST

తాజాగా వైసీపీ అధినేత మరియు ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శల వెల్లువ లెవనెత్తుతుంది.గతంలో టీడీపీ హయాంలో లోకేష్ కు కోటాను కోట్లు చెల్లించి టీటీడీ బోర్డులోసభ్యునిగా చేరాడాని అంతే కాకుండా ఎన్నో అవినీతి ఆరోపణలు అభియోగాలు కూడా శేఖర్ రెడ్డిపై ఉన్నాయని స్వయానా జగన్ సహా అప్పటి వైసీపీ కీలక నేతలు అంతా చెప్పుకొచ్చారు.

కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే అదే శేఖర్ రెడ్డికి జగన్ హయాం లో కూడా అవకాశం ఇచ్చారు.అంటే అప్పుడు ఆరోపించిన వారే మళ్లీ విడ్డూరంగా పక్కన పెట్టుకున్నారు.అంటే ఈ లెక్కన అసలు ఏం జరుగుతుందని సోషల్ మీడియాలో వైసీపీ వారికి గట్టిగానే ప్రశ్నలు నెటిజన్లు సంధిస్తున్నారు.ఇప్పుడు దీనిపై జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ అవకాశంగా తీసుకుని వైసీపీ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తే జనసేన పార్టీకు మంచి మైలేజ్ వచ్చే అవకాశం ఉందని జనసేన అభిమానులు అంటున్నారు.

ఇప్పటి వరకు జనసేన మరియు తెలుగుదేశం పార్టీలు ఒకటే అని ప్రొజెక్ట్ చేసిన వైసీపీ ఈ దెబ్బతో తెలుగుదేశం మరియు వైసీపీలు ఒకటే అన్న విధంగా పరిణామాలు మారాయి.ఇది మాత్రం పవన్ కు మంచి అవకాశమే అని చెప్పాలి.దీనిపై చిన్న ప్రెస్ మీట్ పెట్టి నిప్పు రాజేసినా అది ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశం ఉంది.మరి పవన్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటారో చూడాలి.