బిగ్ బ్రేకింగ్ : జగన్ విప్లవాత్మక నిర్ణయంకు ఇది అగ్ని పరీక్ష.!

Saturday, December 14th, 2019, 11:38:24 AM IST

గత కొన్ని రోజుల క్రితం తెలంగాణాలో జరిగిన దిషా ఘటన ఎంత సంచలనం రేపిందో అందరికి తెలుసు.దీనితో దేశ వ్యాప్తంగా చట్టాలు మరింత కఠినతరం చెయ్యాలని అన్ని రాజకీయ పార్టీల వారు భావించారు. అందులో భాగంగానే ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి దిషా చట్టం అని ఒక సరికొత్త బిల్లును ప్రవేశపెట్టడంతో ప్రతిపక్ష పార్టీలు సహా ఏపీ ప్రజలు అంతా ఆ నిర్ణయాన్ని హర్షించారు.ఇదిలా ఉండగా ఈ బిల్లు పాసైన 24 గంటల్లోపే ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది.

గుంటూరు జిల్లాలోని రామిరెడ్డి నగరపాలెంలోని ఇంటర్ చదువుతున్న లక్ష్మణ రెడ్డి అనే యువకుడు ముక్కు పచ్చలారని ఎల్ కె జి పసిపాప పై అత్యాచారానికి పాల్పడ్డాడని వార్త బయటకు వచ్చింది.ఇప్పుడు అసలు సిసలైన పరీక్ష జగన్ కు మొదలయిందని,ఇప్పుడు ఈ తప్పు చేసిన లక్ష్మణ “రెడ్డి” అనే యువకునికి జగన్ ప్రవేశ పెట్టిన బిల్లు ప్రకారం ఉరి శిక్ష వేస్తాడో లేదో చూడాలని లేదా వారి కులం తోక చూసి హైలీ రెస్పెక్టెడ్ సీఎం గారు వదిలేస్తారా అని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది.ఇప్పటికే జగన్ తన వర్గానికే మొదటి ప్రాధాన్యత ఇస్తారని ఓ టాక్ ఏపీ రాజకీయ వర్గాల్లో ఉంది.అందుకు ఉదాహరణగా జగన్ సీఎం అయ్యాక కట్టబెట్టిన పదవులనే చాలా మంది చూపిస్తారు.మరి ఇప్పుడు జగన్ సరైన న్యాయం ఎలా చేస్తాడో తప్పకుండ చూడాలి అని అంతా అంటున్నారు.