ఇంత వినయం వల్లేనా బీజేపీని ఏమీ అనట్లేదు..

Wednesday, September 18th, 2019, 12:20:19 PM IST

మొత్తం 175లో 151 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాల్లో 22 ఎంపీ స్థానాలు కూడా వారివే అయినా సరే అసలు ఎక్కడా కూడా డిపాజిట్లు తెచ్చుకోని ఒక పార్టీను మాత్రం ఎందుకో ఒక్క మాట కూడా అనలేకపోతున్నారు.ఇంతకీ ఆ రెండు పార్టీలు ఇప్పటికే అర్ధం అయ్యే ఉంటాయి,ఒకటి వైసీపీ మరొకటి బీజేపీ.జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ కంటే గట్టిగా బీజేపీ మొదటి నుంచి విమర్శలు చేస్తూ వస్తుంది అయినా సరే వారికి ఏమీ కనపడడం లేదు అన్నట్టుగా ఒక్క తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలకు సమాధానం వైసీపీ ఇస్తుంది తప్ప బీజేపీ విమర్శలకు సమాధానం ఇవ్వలేకపోతున్నారు.

వైసీపీ మరియు జగన్ పై ఈ మధ్యన విమర్శలు ధాటి కాస్త పెంచినా సరే వారిపై పల్లెత్తి ఒక్క మాట కూడా వైసీపీ నేతలు అనలేకపోవడానికి కారణం మాత్రం ముమ్మాటికీ నరేంద్ర మోడీయే అని సామాన్య ప్రజలు సహా నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.వైసీపీ వారు మోడీ పట్ల అతి వినయం ప్రదర్శిస్తున్నారని,నిన్న ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా చాలా మంది ఆయనకు శుభాకాంక్షలు తెలుపగా వైసీపీ కీలక నేత మరియు జగన్ కు అత్యంత సన్నిహితుడు అయినటువంటి ఎంపీ విజయసాయి రెడ్డి మాత్రం ఏకంగా హిందీ భాషలోనే ట్వీట్ చేసి మోడీకి శుభాకాంక్షలు తెలిపారు.

మోడీ నాయకత్వంలో దేశం మరింత ముందుకు ప్రగతి బాటలో వెళ్లాలని ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నానని తెలుపుతూ ట్వీట్ చేసారు.వవ ట్వీట్ చూసి ఒక్కొక్కరు కామెంట్స్ లో బాగానే కామెంట్స్ చేస్తున్నారని ఇందుకే ఇక్కడ బీజేపీపై ఎలాంటి విమర్శలు చేయలేకపోతున్నారని,అంతే కాకుండా ఇప్పుడు హిందీలో శుభాకాంక్షలు తెలిపినట్టుగా ప్రత్యేక హోదా కోసం ఎందుకు ట్వీట్ చేసి ప్రశ్నిచలేకపోతున్నారని నిలదీస్తున్నారు.మరి రాబోయే రోజుల్లో అయినా సరే బీజేపీపై జగన్ యుద్ధం ప్రకటిస్తారో లేదో చూడాలి.