బ్రేకింగ్ : రోజాకు మంత్రి పదవి ఇవ్వకపోడానికి అసలు కారణం ఇదే!?

Sunday, June 9th, 2019, 02:59:18 PM IST

వైసీపీలో మొన్నటి వరకు ఒక రచ్చ నడిస్తే ఇప్పుడు మరో రచ్చ నడుస్తుంది.ఆ పార్టీ అధినేత మరియు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన క్యాబినెట్ లో ఉండబోయే మంత్రు వీరే అని ఒక జాబితా విడుదల చేయగా ఇప్పుడు దాని విషయంలో అసమ్మతి నేతల రచ్చ నడుస్తుంది.గత కొన్నేళ్లుగా పార్టీకోసం ఎంతో శ్రమించి జగన్ వెంటే తిరిగిన చాలా మంది కీలక నేతలకే మంత్రి పదవులు దక్కకపోవడంతో వైసీపీ శ్రేణులే ఆశ్చర్యపోతున్నారు.అసలు పార్టీలో ఖచ్చితంగా ఎవరికి అయితే మంత్రి పదవులు దక్కుతాయని అంతా అంచనా వేసుకున్నారో వారెవ్వరికీ జగన్ అవకాశం ఇవ్వకుండా అందరి అంచనాలను తలకిందులు చేసారు.

అలా మంత్రి పదవి తప్పకుండా వస్తుంది అని అనుకున్న వారిలో నగరి ఎమ్మెల్యే రోజా కూడా ఒకరు.రోజా వైసీపీలో చేరినప్పటి నుంచి ఆ పార్టీకి కానీ జగన్ వెంట ఉండి కానీ ఎలాంటి కర్తవ్యాన్ని నిర్వర్తించారో ఆ పార్టీ శ్రేణులకు అందరికీ బాగా తెలుసు.దానితో జగన్ క్యాబినెట్ లో రోజాకు అంతా మంత్రి పదవి ఖాయమని అంతా అనుకున్నారు.అంత వరకు ఎందుకు జగన్ తన క్యాబినెట్ లో ఎవరెవరు ఉంటారో తెలియజేసే రోజున మీటింగు నిర్వహించేంత వరకు కూడా రోజాకు పదవి ఖాయమని అనుకున్నారు.కానీ అనూహ్యంగా చోటు దక్కలేదు.దీనితో జగన్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

దీనికి అనేక కారణాలు బయటకు వచ్చినా ఇప్పుడు మాత్రం ప్రధానంగా మరో కారణం వినపడుతుంది.మొత్తం 151 మంది ఎమ్మెల్యేలలో అన్ని సామాజికవర్గాలు సంబంధించి జగన్ కీలక చర్చలు నిర్వహించిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని సామాజిక వర్గాల సమీకరణాలను బేరీజు వేయగా రోజాకు మంత్రి పదవి ఇచ్చేందుకు అవకాశాలు లేకపోయాయని అందుకే రోజాకు మంత్రి పదవి దక్కలేదని తెలుస్తుంది.ఎలాగో ఇప్పుడున్న మంత్రులు కేవలం రెండున్నరేళ్లు మాత్రమే ఆ పదవుల్లో ఉంటారన్న సంగతి తెలిసిందే ఆ తర్వాత ఏమన్నా జగన్ అవకాశం ఇచ్చేందుకు అవకాశాలు కూడా లేకపోలేవని వైసీపీ శ్రేణులు అంటున్నారు.