ఇక జనసేనాని అసలు ఆట మొదలు పెట్టాల్సిన టైం వచ్చింది!

Wednesday, October 9th, 2019, 08:17:34 AM IST

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలు చాలా మంది తక్కవ అంచనా వేస్తారు.తన రాజకీయాల పట్ల కానీ రాష్ట్ర రాజకీయాల పట్ల కానీ పవన్ కు చాలా ముందు చూపు ఉంది.కాకపోతే తోటి నాయకుల వల్ల పవన్ చిన్న చిన్న తప్పిదాల వల్ల జనసేన ఈసారి జరిగిన ఎన్నికల్లో ఊహించిన స్థాయిలో రాణించలేకపోయింది.అయితే జనసేన పార్టీ విషయంలో ఇతర పార్టీలు తీవ్ర స్థాయిలో విషం కక్కారు.అప్పుడు అంటే అది వాళ్ళ టైం.ఇప్పుడు పర టైం మొదలయ్యిందా అన్న సూచనలు అయితే కనిపిస్తున్నాయి.

ఈ సమయాన్ని కానీ జనసేన క్యాష్ చేసుకున్నట్లయితే భవిష్యత్తు రాజకీయాలకు చాలా దోహదపడుతుందని జనసేన సీనియర్ ఫాలోవెర్స్ అంటున్నారు.ఇప్పుడు ఏపీలోని ఒక్క జనసేన పార్టీ మినహా మిగతా రెండు పార్టీలలో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి.ఒక పక్క తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుంది.మరో పక్క వైసీపీ అభిమానులు జగన్ వైఖరి నుంచి ఇప్పుడిప్పుడే రియలైజ్ అవ్వడం మొదలు పెట్టారు.

అయితే జనసేన నుంచి కూడా కొంతమంది నేతలు బయటకు వెళ్లిపోతున్నా సరే పార్టీతో చచ్చేంత వరకు మేమున్నామని పవన్ అభిమానులు సహా జనసేన పార్టీ అభిమానులు భరోసా ఇస్తున్నారు.ఇపుడు ఈ రెండు పార్టీలకు గడ్డు పరిస్థితి ఉంది ఈసమయంలో కానీ పవన్ సరైన ప్రణాళిక వేసి రాబోయే పంచాయితీ ఎన్నికల్లో కానీ సత్తా చాటితే జనసేన బలం మరింత పెరుగుతుందని జనసేన సీనియర్ ఫాలోవెర్స్ అంటున్నారు.అంతే కాకుండా ఇలాంటి సమయంలోనే పవన్ తన మార్క్ రాజకీయాలను ప్రదర్శిస్తే పార్టీకు మరింత ప్లస్ అవుతుందని అభిమానులు కోరుకుంటున్నారు.కానీ ప్రస్తుతం పవన్ ఆరోగ్యం అంతగా బాలేదు,మరి జనసేనాని ఏం చేస్తారో చూడాలి.