“సరిలేరు నీకెవ్వరు” ఇంకో బ్లాక్ బస్టర్ ఆన్ ది వే?

Wednesday, June 5th, 2019, 03:26:38 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా సినిమా మహర్షి ఇంకా థియేటర్లలో ఉండగానే అనీల్ రావిపూడితో “సరిలేరు నీకెవ్వరు” కూడా మొదలు పెట్టేసారు.మొన్ననే విడుదల చేసిన టైటిల్ పోస్టర్ తోనే మహేష్ ఈ సినిమాలో పవర్ ఫుల్ ఆర్మీ మేజర్ గా కనిపించనున్నారని చెప్పేసారు.దీనితో ఈ సినిమాతో మహేష్ ఖాతాలో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అందుకోనున్నారని మహేష్ అభిమానులు ధీమాగా ఉన్నారు.అయితే ఈ చిత్రానికి సంబంధించి కథ ఎలా ఉండబోతుందో అనే అంశం పై సినీ వర్గాల నుంచి అంతర్గత సమాచారం తెలుస్తుంది.

ఈ చిత్రంలో ఫస్టాఫ్ లోనే మహేష్ పవర్ ఫుల్ ఆర్మీ మేజర్ గా కనిపిస్తారట.అలాగే సీడెడ్ లోని విజయశాంతి మరియు జగపతిబాబులకు సంబంధించి రెండు ఫ్యాక్షన్ కుటుంబాలు ఉండగా ఆ కుటుంబ గొడవల్లో మహేష్ ఆర్మీలో ఉండే ఒక స్నేహితుడు చనిపోతాడు.అతను ఎప్పుడు మహేష్ తో తన కుటుంబం కోసం మాట్లాడుతూ మహేష్ తో చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఉంటాడట.అతను సడెన్ గా చనిపోయే సరికి అతని ఊరెళ్ళగా అక్కడ అంతా ఫ్యాక్షన్ గొడవలు ఇలా అనేకం మహేష్ కు ఎదురవుతాయి.

దీనితో వాటన్నిటినీ మహేష్ ఎలా అధిగమించాడో అన్నట్టుగా ఈ సినిమా తాలూకా స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంటుందట.ఈ నేపథ్యంలోనే బంగారుబాబుగా బండ్ల గణేష్ పాత్ర ఆ ఊర్లో కనిపిస్తుందని టాక్.వీటన్నిటిని బేస్ చేసుకొని అనీల్ కూడా చాలా జాగ్రత్తగా స్క్రిప్ట్ ను రెడీ చేసుకొని మహేష్ అభిమానులకు మరోసారి కాలర్ ఎగరేసే సినిమా అందించబోతున్నారని సినీ వర్గాలు చెప్తున్నాయి.ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.మరి మహేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ తో పడిందో లేదో తెలియాలంటే వచ్చే వచ్చే ఏడాది సంక్రాంతి వరకు ఆగాల్సిందే.