ఇప్పుడు తెలుస్తుంది వైసీపీ,బీజేపీ ఒకటా కాదా అన్నది.!

Tuesday, September 10th, 2019, 03:11:57 PM IST

మొట్టమొదటి సారిగా వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వైసీపీ మీద పెద్ద ఎత్తున్న విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే కాకుండా జనసేన మరియు బీజేపీ పార్టీలు కూడా జగన్ మరియు వైసీపీ వైఫల్యాలపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.అయితే వైసీపీ మాత్రం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన శ్రేణుల మీద ప్రతివిమర్శలు చేస్తున్నారు వారికి మాత్రమే సమాధానం ఇస్తున్నారు కానీ వారిని ఈ రెండు పార్టీల కంటే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న బీజేపీ ను మాత్రం మినహాయించి వారిపైనే తీవ్ర స్థాయి విమర్శలు చేస్తున్నారు.

అసలు బీజేపీ ఎన్ని మాటలు అంటున్నా సరే వైసీపీ నేతలు ఒక్క మాట కూడా తిరిగి అనకుండా ఉండడం గమనార్హం.వారి పేరు చెప్పి దాటవేస్తున్నారే తప్ప అసలు వైసీపీ నేతలు బీజేపీ నేతలను కానీ ఆ పార్టీను కానీ టీడీపీపై చేసిన స్థాయి వ్యాఖ్యలు చెయ్యడానికి మాత్రం ధైర్యం చేయలేకపోతున్నారు.సరే ఇదంతా వదిలేద్దాం ఈ రోజు తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మి నారాయణ జగన్ 100 రోజుల పాలనపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ 100 రోజుల పాలన అంశాన్ని వైసీపీ శ్రేణులు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.మరి ఈ సమయంలో కూడా బీజేపీ పై వైసీపీ ఏమీ రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం ఇప్పటి వరకు ఇతర పార్టీలు వైసీపీ బీజేపీ బి పార్టీయా అని వ్యక్తం చేస్తున్న అనుమానాలు అన్ని నిజమే అని వైసీపీ వారు ఒప్పుకున్నట్టే అవుతుంది.మరి వైసీపీ నుంచి బీజేపీపై మొట్టమొదటి సారిగా ఎవరు ఎదురు తిరుగుతారో చూడాలి.