జనసేన – బీజేపీ పొత్తు వారికి నచ్చలేదా..?

Thursday, July 30th, 2020, 07:06:37 AM IST

జగన్ కొట్టిన ఒకే ఒక్క దెబ్బకు ఏపీలోని ముఖ్య పార్టీలు అయినటువంటి మిగతా పార్టీలు అన్ని షేప్ లు మారిపోయాయి. దీనితో ఒక పార్టీ బలపడడానికి మరో పార్టీతో చేతులు కలుపుతున్నారు. అలా కలిసిన రెండు పార్టీలు ఏమన్నా ఉన్నాయి అంటే అది జనసేన మరియు బీజేపీ పార్టీలు అని చెప్పాలి.

వచ్చే ఎన్నికల వరకు వీరు కలిసే పని చెయ్యాలని భావించారు. అయితే జగన్ కొట్టిన దెబ్బతో టీడీపీ కి మరింత బలం కావాల్సి వచ్చింది. అందుకే ఎప్పుడైతే బీజేపీ ని తిట్టారో అదే పార్టీతో కలవాలని ప్రయత్నించారు.

కానీ వారు పవన్ తో కలవడం టీడీపీకి నచ్చలేదట. అందుకే ఈ రెండు పార్టీల నేతల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఆ పార్టీ అనుకూల వ్యక్తులు చేస్తున్నారని ఇరు పార్టీల శ్రేణులు అంటున్నారు.