1000 కోట్ల బెట్టింగ్‌ : రిప‌బ్లిక్ డే బిగ్‌ఫైట్ ఆ రెండిటి మ‌ధ్య‌నే!!

Monday, January 8th, 2018, 11:00:27 PM IST

ఈ సంక్రాంతికి సౌత్‌లో భారీ చిత్రాలు రిలీజ‌వుతున్నాయి. అయితే బాలీవుడ్‌లో మాత్రం సంక్రాంతి త‌ర్వాత అస‌లు పోటీ మొద‌లు కానుంది. ముఖ్యంగా సంక్రాంతి పండ‌గ వెళ్లాక నెలాఖ‌రులో జ‌న‌వ‌రి 25, జ‌న‌వ‌రి 26 తేదీల్లో రిప‌బ్లిక్ డే కానుక‌గా భారీ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. రెండ్రోజుల్లో మూడు భారీ చిత్రాలు క్యూలో ఉన్నాయి. ఈ మూడు సినిమాల రూపంలో బాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద ఏకంగా 1000 కోట్ల పందేరం న‌డ‌వ‌నుంద‌ని తెలుస్తోంది.

ఇప్ప‌టికే సంజ‌య్ లీలా భ‌న్సాలీ `ప‌ద్మావ‌త్‌` సెన్సార్ పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీ అవుతోంది. వాస్త‌వానికి ఈ సినిమాని ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ చేసే అవ‌కాశం ఉంద‌ని భావించినా, అంత‌వ‌ర‌కూ భ‌న్సాలీ ఆగేలా లేడుట. ఓవైపు అక్ష‌య్‌కుమార్ హీరోగా న‌టించిన ప్యాడ్ మ్యాన్ అత్యంత క్రేజీగా జ‌న‌వ‌రి 26న రిలీజ‌వుతోంది. అంత‌కు ఒక రోజు ముందే అంటే జ‌న‌వ‌రి 25న ప‌ద్మావ‌త్ రిలీజ్ కానుందిట‌. ఆ క్ర‌మంలోనే ప‌ద్మావ‌త్‌, ప్యాడ్ మ్యాన్ మ‌ధ్య భారీ పోటీ నెలకొంది. రెండు భారీ చిత్రాల ఢీ త‌ప్ప‌నిస‌రి. అలాగే ఈ రెండితో పోటీప‌డుతూ మ‌రుస‌టి రోజు సిద్ధార్థ్ మ‌ల్హోత్రా `అయ్యారే` రిలీజ్ కానుంది. అయ్యారే ట్రైల‌ర్ కి మంచి స్పంద‌న వ‌చ్చింది కాబ‌ట్టి ఇది కూడా వార్‌లో గ‌ట్టి పోటీనే ఇవ్వ‌నుంది. అయితే భ‌న్సాలీ ప‌ద్మావ‌త్‌కి , అక్ష‌య్ ప్యాడ్‌మ‌న్‌కి ఉన్న క్రేజు దీనికి ఉండ‌దు. ఇక ఇవి మూడు భారీ బ‌డ్జెట్ సినిమాలే. ప‌ద్మావ‌తి చిత్రం దాదాపు 150 కోట్ల బ‌డ్జెట్ సినిమా. అక్షయ్ ప్యాడ్‌మేన్ 60 కోట్ల మేర బ‌డ్జెట్‌తో తెర‌కెక్కితే, అయ్యారే ఇంచుమించు అదే బ‌డ్జెట్‌తో తెర‌కెక్కింది. అయితే ఇవి స‌క్సెసైతే దాదాపు 1000 కోట్ల మేర వ‌సూల్లు తెస్తాయ‌న్న అంచ‌నాలున్నాయి. ఈ మూడు సినిమాలు క‌లిపి అంత పెద్ద మొత్తాల్ని తెచ్చేవేన‌న్న చ‌ర్చా ఉంది. చూద్దాం.. ప్ర‌ధాన పోటీ ఏ రెండిటి మ‌ధ్య‌నో.