వైరల్ న్యూస్ :ఈ బుల్లి చిట్టిబాబు ఎంత ముద్దుగా ఉన్నాడో చూసారా!

Thursday, March 22nd, 2018, 12:37:22 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా వెరైటీ చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వం లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమా రంగస్థలం. ఇప్పటికే విడుదలయిన ఈ సినిమాలోని పాటలు, ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తోంది. సినిమా ఈ నెల 30 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుండడంతో యూనిట్ సభ్యులు సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా వున్నారు. ఈ సినిమాలో చిట్టి బాబు క్యారెక్టర్ చేసిన రామ్ చరణ్ వెరైటీ కాస్ట్యూమ్స్, అలానే స్టైల్ చాలా బాగున్నాయని పలువురు మెచ్చుకుంటున్నారు.

అయితే ఆ చిట్టిబాబు గెటప్ లో రామ్ చరణ్ బావ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తనయుడు అయాన్ అదరగొడుతున్నాడు. చిట్టిబాబు గెటప్ లో అయాన్ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. అయాన్ ని ఈ డ్రెస్ లో చూసిన బన్నీ, చరణ్ అభిమానులు బుడతడు భలే అందంగా వున్నాడు అంటూ ఆ ఫోటోను తెగ లైక్ లు, షేర్ లు చేసేస్తున్నారు. ఈ విధంగా ఈ సినిమాకి ఒకరకంగా కొంత పబ్లిసిటీ వచ్చినట్లే మరి….