సైజ్ ప్రకారం పండ్లను వేరు చేస్తున్న ఈ ప్రక్రియ చూసారా?

Sunday, June 28th, 2020, 04:32:39 PM IST

వ్యాపారులకు పండ్ల ను సైజ్ ల ప్రకారం వేరు చేయాలంటే పెద్ద తలనొప్పి అని చెప్పాలి. అయితే కొద్దిగా పండ్లు ఉంటే వాటిని సైజ్ ల ప్రకారం వేరు చేయడం పెద్ద శ్రమ అనిపించదు. అయితే పెద్ద మొత్తం లో, వందల సంఖ్యలో ఈ పండ్లు ఉంటే వాటిని సెపరేట్ చేసేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అయితే ఈ వీడియో లో చూపించినట్లు గా చేసినట్లయితే మనం పండ్లను సైజ్ ల ప్రకారం వేరు చేయవచ్చు. ఇక్కడ ఉన్న పరికరం తో చిన్న నుండి పెద్ద సైజ్ ల ప్రకారం ఒక వరుసలో డబ్బాలను పెట్టడం జరిగింది. అయితే చిన్న పరిణామం కలిగిన పండు ఆ సైజ్ కి వెంటనే మొదటి డబ్బాలో పడుతుంది. అలానే సైజ్ పెరిగే కొద్దీ, ఆ తరవాత ఉన్న డబ్బాలో పండు వెళ్తుంది. అయితే ఇది ప్రయోజనకరం అని కొందరు చెబుతున్నారు.

దీనిని మనం రెండు కర్రల సహాయంతో కూడా తయారు చేసుకోవచ్చు. అన్నిటికంటే సులువైన పద్దతి. మీరు కూడా ఇలాంటి వ్యాపారం చేసేవారు అయితే ఈ ప్రక్రియ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీరు ఒక సారి దీన్ని లుక్కేయండి.