హాట్ టాపిక్ : ట్రంప్ తో విందుకు జగన్ కు ఆహ్వానం రాకపోడానికి కారణం ఇదే.!?

Tuesday, February 25th, 2020, 11:20:12 AM IST

నిన్ననే ప్రపంచ అగ్ర రాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు మొట్టమొదటి సారిగా విచ్చేయగా భారీ ఘన స్వాగతాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ అందించారు.అయితే ట్రంప్ పర్యటన మన దగ్గర ఖరారు అయ్యినప్పటి నుంచీ అనేక స్పెక్యులేషన్స్ మొదలయ్యాయి.ట్రంప్ తో సమావేశంలో ఎవరెవరు ఉండబోతున్నారు.విందుకు మోడీ సర్కార్ ఎవరెవర్ని ఆహ్వానిస్తారు అని మన తెలుగు రాష్ట్రాల ప్రజలే ఎక్కువగా ఆసక్తి చూపారు.

అయితే ఇక్కడే ఏపీ తాజా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కూడా వెళ్తారా ఆయనకు ఆహ్వానం వస్తుందా లేదా అని వైసీపీ శ్రేణులు ఎంతగానో ఎదురు చూడగా అనుకున్న విధంగానే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కంటే జగన్ కే కేంద్ర ప్రభుత్వంతో దోస్తీ ఉన్నప్పటికీ కెసిఆర్ కు మాత్రమే ఆహ్వానం వచ్చింది కానీ జగన్ కు రాలేదు.అయితే దీనికి గల కారణాలను కొన్ని సీనియర్ మోస్ట్ విశ్లేషకులు చెప్తున్నారు.

కెసిఆర్ మరియు జగన్ లలో కెసిఆర్ కే ఎందుకు ఆహ్వానం వచ్చింది జగన్ కు ఎందుకు రాలేదు అంటే జగన్ కంటే కెసిఆర్ అనుభవజ్ఞ్యడు అలాగే ఇప్పటికే రెండు సార్లు ముఖ్యమంత్రి కానీ జగన్ ఇదే మొదటిసారి కావడం అలాగే ఏపీ ప్రభుత్వం కన్నా తెలంగాణ ప్రభుత్వమే విదేశీ సంస్థలు మరియు గూగుల్ వంటి బడా కంపెనీలతో టై అప్ అయ్యి ఉండడం అలాగే అమెరికా వంటి దేశాలతో లింకప్ అయ్యి ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఉండాలని అందుకు జగన్ కు ట్రంప్ తో విందుకు ఆహ్వానం రాలేదని విశ్లేషకులు తెలుపుతున్నారు.