బాబుకు సాధ్యం కానిది జగన్ చేస్తున్నారా..?అందుకే ఇలా..!

Monday, February 17th, 2020, 09:58:54 AM IST

ప్రస్తుతం ఏపీలో ఉన్నటువంటి రెండు కీలక పార్టీలు వైసీపీ మరియు తెలుగుదేశం పార్టీల నడుమ కొన్ని ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో టీడీపీ వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్రలో వైసీపీ కాస్త విఫలం అయినా ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న టీడీపీ మాత్రం వైసీపీ కంటే ఒక ఆకు ఎక్కువే చదివింది అని చెప్పాలి.దీనికి కారణం అప్పుడు చంద్రబాబు అధికారంలో సాధించలేనిది జగన్ చేస్తున్నాడనే కారణం ఒకటే అని ఇప్పుడు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.

నిజానికి జగన్ ఢీల్లీకి వెళ్తున్న ప్రతీసారి మోడీ మరియు షా లనుంచి సానుకూల స్పందనే వస్తుంది అని అంటున్నారు.కానీ టీడీపీ నేతలు మాత్రం కావాలనే జగన్ కేంద్రంలో అక్షింతలు వేస్తున్నారని సంచలన కామెంట్స్ చేస్తున్నారు.కానీ నిజానికి సీన్ అంతా రివర్స్ లో ఉందని గతంలో చంద్రబాబు 29 సార్లు ఢిల్లీ వెళ్లినా అతను సాధించలేని పలు అంశాలను జగన్ సాధిస్తున్నాడని అందుకే టీడీపీ నేతలు ఇంత స్థాయిలో విష ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలు వాదిస్తున్నారు.