బిగ్ న్యూస్ : తెలంగాణాలో లేటెస్ట్ లెక్కలు అందుకే రాలేదట.!

Sunday, July 26th, 2020, 09:52:37 AM IST

భారత్ మొత్తం కరోనా లెక్కలు తో నిండిపోయింది. ఏ రాష్ట్రంలో ఎన్ని టెస్టులు జరుగుతున్నాయి? ఎంత మంది కరోనా బారిన పడ్డారు? ఎంత మంది రికవర్ అవుతున్నారు? ఎంత మంది మరణించారు? ఇలా దీనికి సంబంధించిన అన్ని లెక్కలను ప్రతీ రాష్ట్రం వారు వారి వైద్య సిబ్బంది అందిస్తున్న సమాచారాన్ని ప్రతీ 24 గంటలకు ఓసారి అందిస్తున్నారు.

అదే ఫార్మాట్ లో మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ప్రతీ రోజూ విడుదల అవుతున్నాయి. కానీ నిన్న తెలంగాణా రాష్ట్ర బులిటెన్ రాకపోవడం మరోసారి ఆ రాష్ట్ర ప్రభుత్వంపై అనేక అనుమానాలకు తావు తీసింది. అయితే ఇందులో అనుమాన పడటానికి ఏమీ లేదని తెలుస్తుంది.

వారు ఈరోజు ఉదయం నుంచి కరోనా లెక్కలను ఒక సరికొత్త ఫార్మాట్ లో అందివ్వనున్నారట అందుకే నిన్న ఆపి ఈరోజు ఉదయం నుంచి అప్పటి లెక్కలు కలిపి ఇవ్వనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఏ ఫార్మాట్ అయితే ఏంటి ముందు సరైన లెక్కలు చెప్తే చాలు అని నెటిజన్స్ అంటున్నారు.