రివ్యూ రాజా తీన్‌మార్ : మీ తొలిప్రేమను గుర్తుకు తెస్తుంది !

Saturday, February 10th, 2018, 05:03:45 PM IST

తెరపై కనిపించిన వారు : వరుణ్ తేజ్, రాశి ఖాన్న, ప్రియదర్శి, హైపర్ ఆది

కెప్టెన్ ఆఫ్ ‘ఇంటెలిజెంట్ ‘ : వెంకి అట్లూరి

మూల కథ :

ఆదిత్య (వరుణ్ తేజ్) మనసుకు నచ్చింది చెప్పే టైప్. ఎలాంటి రిస్క్ అయినా సరే పేస్ చేసి సక్సెస్ సాధించే ఆదిత్య జీవితంలోకి వర్ష (రాశిఖాన్న) వస్తుంది. ఇంటర్ చదివే వయసులో ఉన్న వీరిద్దరు కాలేజీ లో కలుసుకుంటారు. ఒక కారణం వల్ల ఇద్దరు విడిపోవడం జరుగుతుంది. ఆ తరువాత ఉద్యోగ రిత్య ఇద్దరు లండన్ లో కలుసుకోవడం జరుగుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? చివరికి వీరు కలుసుకున్నారా ? ఎలా కలుసుకున్నారు అన్నది ఈ చిత్ర కథాంశం.

విజిల్ పోడు :

లవర్ బాయ్ గా, ఉద్యోగస్తుడిగా వరుణ్ తేజ్ బాగా నటించాడు. పాటల్లో రెండు మూడు మూమెంట్స్ బాగా చేసాడు కావున మొదటి విజిల్ వరుణ్ కు వేయాలి.

రాశి ఖాన్న నటన, ఆమె అబినయం బాగుంది. లవ్ ఫెయిల్ అయినప్పుడు ఆమె చెప్పే డైలాగ్ డెలివరి బాగుంది కావున రెండో విజిల్ రాశిఖాన్న కు వేయాలి.

తమన్ సంగీతం, డైరెక్టర్ టేకింగ్, జార్జ్ సినిమాటోగ్రఫీ, సినిమాకు హైలెట్ గా నిలిచాయి కావున వీరందరికీ కలిపి మూడో విజల్ వేయాలి.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

సెకండ్ హాఫ్ లో రెండు మూడు సీన్స్ సాగాతీసిన ఫీలింగ్ కలుగుతుంది.

మాస్ ఆడియన్స్ నచ్చే కమర్సియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో పెద్దగా లేవు.

క్లైమాక్స్ ఇంకా బాగా తీసింటే బాగుండేది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

యూత్ ను ఆకర్చించే సన్నివేశాలు ఈ సినిమాలో చాలా ఉన్నాయి

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఎ : పవన్ కళ్యాణ్ తొలిప్రేమ అంత ఉందా ఈ తొలిప్రేమ ?

మిస్టర్ బి : ఆ సినిమా అంత ఇది లేనప్పటికీ ఇది కుడా బాగుంది

మిస్టర్ ఎ: వరుణ్ తేజ్ , రాశి ఖాన్న ఎలా చేసారు?

మిస్టర్ బి : బాగా చేసారు, వాళ్ళ కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది.

మిస్టర్ ఎ: అయితే తొలిప్రేమ ను చూడొచ్చు అంటావా ?

మిస్టర్ బి : హ్యాపీ గా చూడొచ్చు.