తొలిప్రేమ విడుదల వాయిదా ?

Tuesday, January 30th, 2018, 05:33:34 PM IST

మెగా బ్రదర్ నాగ బాబు తనయుడు వరుణ్ తేజ్ నూతన చిత్రం తొలి ప్రేమ చిత్రం విడుదల ఒక రోజు వాయిదా పడ్డట్లు ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. విషయం లోకి వెళితే నిజానికి సాయి ధరమ్ తేజ్ ఇంటిలిజెంట్ , వరుణ్ తేజ్ తొలిప్రేమ లు తొలుత ఫిబ్రవరి 9 వ తేదీన విడుదలకు ముహూర్తం నిశ్చయించిన విషయం తెలిసిందే. అయితే ఇద్దరు మెగా హీరోల చిత్రాలు ఒకే రోజు విడుదలవడం మంచి సంకేతం కాదని మెగా క్యాంపు పెద్దలు అన్నట్లు వార్తలు అందుతున్నాయి. నిజానికి ఈ రెండు చిత్రాల తాలూకు వర్క్ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నట్లు తెలియవస్తోంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం విషయమై జరుగుతున్న వర్క్ నిమిత్తం చెన్నైలో బిజీగా వున్నారు ఆ చిత్ర నిర్మాత భోగవల్లి ప్రసాద్. అందువల్ల సీన్ లోకి వచ్చిన అల్లు అరవింద్ తొలిప్రేమ చిత్రాన్ని అవుట్ రేట్ కి కొనుగోలు చేసిన దిల్ రాజుకు సర్ది చెప్పడంతో, అందులోనూ దిల్ రాజుకు సాయి ధరమ్ తేజ్ తో మంచి అనుబంధం ఉండడంతో ఆయన కూడా ఒక రోజు తర్వాత అంటే ఫిబ్రవరి 10 న చిత్రాన్ని విడుదల చేయడానికి సుముఖంగా ఉన్నట్లు, దానికి తోడు అదే రోజు మోహన్ బాబు గాయత్రి, నిఖిల్ కిర్రాక్ పార్టీ కూడా అదే రోజు విడుదల కానుండడంతో వాయిదా దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ వార్త నిజం అయితే ఫిబ్రవరి సాయి ధరమ్ ఇంటిలిజెంట్, నిఖిల్ కిర్రాక్ పార్టీ, మోహన్ బాబు గాయత్రి మాత్రమే విడుదలవుతాయి….