ఎన్టీఆర్ బయోపిక్ బరిలో ముగ్గురు దర్శకులు ?

Thursday, April 26th, 2018, 10:00:26 PM IST

అన్న నందమూరి తారక రామారావు జీవిత కథతో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ సినిమా ఇటీవలే మొదలైన విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హీరోగా తేజ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాకముందే అనుకోకుండా తేజ తప్పుకోవడం సంచలనం రేపుతోంది. ఇక తేజ ఈ సినిమా ఉంది తప్పుకోవడంతో మరి ఈ సినిమాను ఎవరు పూర్తీ చేస్తారన్న విషయం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ లిస్ట్ లోకి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు ఎంట్రీ ఇచ్చాడు. అయన అయితే సినిమాకు సరైన న్యాయం జరుగుతుందని బావిస్తున్నారు. అయితే ఒకరు మద్దతు పెట్టిన సినిమాను రాఘవేంద్ర రావు చెయ్యడు, సో ఈ సినిమాకు అయన దర్శకత్వం వహించే అవకాశం వన్ పర్సెంటే ఉంది. అయన తరువాత ఇంకెవరు అనే ఆలోచనలో పడ్డారు నందమూరి అభిమానులు . ఈ సినిమాకు రాఘవేంద్ర రావు కాకుండా క్రిష్ దర్శకత్వం వహిస్తాడని అంటున్నారు .. ఒకవేళ అయన కూడా కాదంటే వై వి ఎస్ చౌదరి పేరు వినిపిస్తుంది. చూద్దాం .. మరి ఎవరు లిస్ట్ లోకి వస్తారో.

  •  
  •  
  •  
  •  

Comments