తెలంగాణకి చేరుకున్న 3 లక్షల కోవిషీల్డ్ టీకా డోసులు

Thursday, April 29th, 2021, 02:25:36 PM IST

కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టడం లో టీకా లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రం లో ప్రస్తుతం టీకా ల కొరత ఉన్న సంగతి తెలిసిందే. అయితే నేడు తెలంగాణ కి మూడు లక్షల కోవిషీల్డ్ టీకాలు చేరుకున్నాయి. పూణే నుండి శంషాబాద్ విమానాశ్రయానికి ఈ మూడు లక్షల కోవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. అయితే ఈ వాక్సిన్ ను కోఠి లోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించి, అక్కడి నుండి ఆసుపత్రులకు ఈ టీకాలను పంపిణీ చేయనున్నారు. అయితే టీకా కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారి వివరాల ఆధారం గా ఇవి పంపిణీ చేయనున్నారు. అయితే ఇప్పటికే తెలంగాణ లో టీకా ల కొరత ఉంది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రోజూ ఒక లక్ష నుండి లక్షన్నర టీకాలు వేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ లో ఇప్పటికే పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య సైతం పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వాక్సిన్ కోసం కేంద్రాలకు చేరుకున్న వారు సంఖ్య పెరుగుతూనే ఉంది. వాక్సిన్ కొరత ఉండటం తో ప్రజలు అక్కడి నుండి వెనుదిరిగే పరిస్తితి ఏర్పడుతుంది. అయితే మే 1 వ తేదీ నుండి 18 ఏళ్లు దాటిన వారు సైతం టీకా వేయించుకొనేలా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే టీకాల అవసరం ఇంకా తెలంగాణ రాష్ట్రానికి ఉందని చెప్పాలి. మరొక పక్క ఇప్పటి వరకూ కూడా రాష్ట్రంలో 45 లక్షలకు పైగా టీకాలు వేయించుకున్నారు.