ఆ ముగ్గురు పవన్ కోసం ప్రయత్నం.. డెసిషన్ చేంజ్ అవ్వనుందా?

Tuesday, September 10th, 2019, 05:30:58 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలు వొదిలేసి, రాజకీయాల్లోనే పూర్తిగా ఉంటారని ఖరాకండిగా చాలాసార్లు తెలిపారు. కానీ పవన్ కోసం ఆ ముగ్గురు ఇంకా ప్రయత్నాలు జరుపుతున్నారని తెలుసుతుంది. ఆ ముగ్గురెవరో. ఆ సంగతేంటో చూద్దాం.

పింక్ చిత్రం బాలీవుడ్ లో విడుదల అయి , తమిళం లో అదే చిత్రాన్ని అజిత్ ని హీరో గా పెట్టి రీమేక్ చేసారు. దిల్ రాజు ఆ చిత్ర హక్కులు కొని పవన్ ని కలిసే ప్రయత్నం లో ఉన్నట్లు వినికిడి, దర్శకుడుని పవన్ నే సెలెక్ట్ చేసుకొనే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈ చిత్ర నిర్మాణం కోసం దిల్ రాజు ఉవ్విళ్ళు ఊరుతున్నాడు. పవన్ ని కలిసి కథ చెప్పడానికి ప్రయత్నాలు జరుగుతూన్నాయని వినికిడి. మరో పక్క దర్శకుడు క్రిష్ కూడా మంచి స్క్రిప్ట్ ని రెడీ చేసి వున్నారు. అతి త్వరలో పవన్ ని కలసి స్టోరీ చెప్పనున్నారని టాక్.

అయితే హరీష్ శంకర్ కూడా ఒక కథ తో శ్రేయాస్ మీడియా ద్వారా పవన్ ని కలవనున్నట్లు సమాచారం. ఏది ఎలా వున్నా, పవన్ కళ్యాణ్ నిర్మాణ రంగం పై కూడా దృష్టి పెట్టినట్లు సమాచారం. ఏదేమైనా పవన్ పై వచ్చే ఈ పుకార్లు నిజమైతే బావుండని ప్రతి పవన్ అభిమాని కోరుకుంటున్నారు. పవన్ ఎన్ని సంవత్సరాల తర్వాత సినిమాల్లోకి వచ్చిన అదే క్రేజ్ ఉంటుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. మరి పవన్ ఏ డెసిషన్ తీసుకుంటాడో వేచి చూడాలి.