ఆ ముగ్గురు నిర్మాతలు రవితేజను ముంచేశారట ?

Friday, September 30th, 2016, 12:56:27 AM IST

ravi-teja
”బెంగాల్ టైగర్” సినిమా తరువాత రవితేజ ఇంతవరకు ఒక్క సినిమా కూడా చేయడం లేదు. ఇప్పటికే రెండు మూడు కథలు విన్నాడు, అవి ఫైనల్ అయ్యాయి కూడా, కానీ ఎందుకో సెట్స్ పైకి రాలేదు. దాంతో అయన నెక్స్ట్ సినిమా ఏమిటా అనే సందేహాలు అందరిలో కలుగుతున్నాయి. ఇక రవితేజ సినిమా చేయకపోవడానికి కారణం ఓ ముగ్గురు నిర్మాతలే అని టాలీవుడ్ టాక్ ? అవునా ? ఆ ముగ్గురు నిర్మాతలు ఎవరు !! అనే సందేహం కలుగుతుందా .. వారెవరనే విషయం పక్కన పెడితే అసలు విషయం ఏమిటంటే రవితేజ తాను ఓకే అన్న రెమ్యూనరేషన్ ఇస్తే తప్పకుండా సినిమా చేస్తాడన్న విషయం అందరికి తెలిసిందే. రేటు విషయంలో అయన ముందే ఫిక్స్ చేస్తాడు .. ఆ తరువాత దానిగురించి మాట్లాడడు. ఈ విషయం గ్రహించిన సదరు నిర్మాతలు రవితేజ కు కథ వినిపించి ఓకే అనిపించుకున్నారట !! కానీ ఇంకా సినిమా మొదలు పెట్టె ఆలోచన్లలో లేరని, దానివల్ల అయన ఏడాది కాలం వృధా అయ్యిందట ! దాంతో ఫైర్ అయినా రవితేజ ఆ సినిమా చేయడంలేదు. అంతే కాదు .. కథల విషయంలో నిర్మాతల పెత్తనం ఉండకూడదని, ఇకపై అలాంటి విషయంలో జాగ్రత్తగా ఉంటానని అంటున్నాడు ?అయితే ఆ ముగ్గురు నిర్మాతలు ఎవరనేది తెలియాల్సి ఉంది ?