టీడీపీనీ వీడనున్న మరో ముగ్గురు ఎమ్మెల్యేలు.. షాక్‌లో చంద్రబాబు..!

Wednesday, December 4th, 2019, 03:48:06 PM IST

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ పరిస్థితి మరింత కుదేలయ్యింది. ఇక పార్టీ తిరిగి పుంజుకునే పరిస్థితులు కనిపించకపోవడంతో పార్టీలోని సీనియర్ నేతలంతా వైసీపీ, బీజేపీలోకి చేరిపోయారు. అయితే మరో ఐదేళ్ళలో కూడా టీడీపీ తిరిగి అధికారం చేపట్టడం కాస్త కష్టమే అనుకున్న నేతలెవరూ టీడీపీలో ఉండేందుకు సాహాసం చేయడంలేదు. అయితే ఇటీవలే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీలో చేరేందుకు రెడీగా ఉన్న వంశీ ఎప్పుడు చేరుతారనేది మాత్రం ఇంకా క్లారిటీ రావడంలేదు.

అయితే తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీనీ వీడేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. జిల్లాకు చెందిన వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యేలతో ఈ మేరకు మంతనాలు జరుపుతున్నారని జిల్లా రాజకీయాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ప్రకాశం జిల్లాలో టీడీపీ తరుపున గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాం, ఏలూరి సాంబశివరావు, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి విజయం సాధించారు. అయితే ఇప్పటికే కొడాలి నాని గొట్టిపాటితో చర్చలు జరిపారని పార్టీ మారేందుకు గొట్టిపాటీ కూడా సుముఖంగానే ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే పర్చూరు శాసనసభ్యుడు ఏలూరికి కొడాలొ ఫోన్‌ చేసి వైసీపీలోకి రావాలని ఆహ్వానించారని పార్టీలోకి వస్తే అన్ని విధాల ప్రాధాన్యం ఉంటుందని చెప్పారటా. ఇక కరణం బలరాంతో కూడా బాలినేని చర్చించారని, అయనను పార్టీలోకి రావాలని కోరినట్టు తెలుస్తుంది. అయితే దీనిపై మంత్రులు త్వరలోనే సీఎం జగన్‌ని కలిసి వివరించనున్నట్టు సమాచారం.