‘థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌’ సెట్స్ నుంచి లీకులు!

Thursday, February 8th, 2018, 06:16:25 PM IST

ఇటీవ‌లి కాలంలో అందాల క‌త్రిన‌కైఫ్ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ అభిమానుల‌కు విప‌రీతంగా న‌చ్చుతోంది. హీరోల‌కు ధీటుగా యాక్ష‌న్ క్వీన్‌గా దుమ్ము దులిపేస్తోంది. బ్యాంగ్ బ్యాంగ్, ధూమ్ 3, టైగ‌ర్ జిందా హై సినిమాలు చూస్తే ఆ సంగ‌తి అర్థ‌మ‌వుతుంది. స‌ల్మాన్‌, హృతిక్‌ల‌కు ధీటుగా యాక్ష‌న్ చేయ‌గ‌ల‌దు. అమీర్ ఖాన్‌కు ధీటుగా పెర్ఫెక్ష‌న్‌తో న‌ట‌ప్ర‌ద‌ర్శ‌న ఇస్తోంది. ఇదంతా అనుభ‌వంతో వ‌చ్చిన కొత్త మెరుపు. బ‌రిలో ఎంద‌రు స్టార్లు ఉన్నా.. త‌న స్థానానికి ఢోకానే లేద‌ని నిరూపిస్తోందంటే అదంతా త‌న డెడికేష‌న్‌తోనే సాధ్య‌మైంది.

ప్ర‌స్తుతం క‌త్రిన థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో త‌న‌తో పాటే అమితాబ్ బచ్చ‌న్, అమీర్ ఖాన్ వంటి స్టార్లు న‌టించారు. ధూమ్ 3 ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌ విజ‌య్‌కృష్ణ ఆచార్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి, ఆన్ లొకేష‌న్ నుంచి క‌త్రిన ఫోటోలు ఆన్‌లైన్‌లో లీక‌య్యాయి. క‌త్రిన గోల్డెన్ డ్రెస్‌లో మెరుపులు మెరిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అభిమానుల స‌మాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. క‌త్రిన ఈ సినిమాలో ఎలాంటి పాత్ర‌లో న‌టిస్తోందో చూడాల‌న్న తాప‌త్ర‌యం క‌నిపిస్తోంది. ఏదేమైనా ఇలాంటి భారీ ప్రాజెక్టున‌కు సంబంధించి ఫోటోలు సెట్ నుంచి లీక‌వ్వ‌డం సినిమాకి డ్యామేజింగ్‌.. దీనిని ఎలా కంట్రోల చేస్తారో చూడాలి.