పదవికోసం తుమ్మల ఆరాటం..?

Thursday, October 16th, 2014, 02:54:37 PM IST

thumala-nageshwar-rao
ఖమ్మం జిల్లా నుంచి తెరాసలో చేరిన తుమ్మల నాగేశ్వరరావు మంత్రి పదవి కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు తెలుస్తున్నది. తెరాస అధినేత.. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకే తుమ్మల నాగేశ్వరరావు తెరాస పార్టీలో చేసినట్టు తెలుస్తున్నది. తెరాస పార్టీకీ మొదటి నుంచి ఖమ్మం జిల్లాలో పట్టులేని విషయం తెలిసిందే. కాగ, ఖమ్మం జిల్లాలో పట్టుకోసం…అక్కడి బలమైన నాయకుడు తుమ్మల నాగేశ్వరరావును కెసిఆర్ తన పార్టీలోకి రావాలని ఆహ్వానం పంపినవిషయం విదితమే. అంతేకాకుండా.. తుమ్మల పార్టీలోకి వస్తే.. ఆయనకు మంత్రి పదవి ఇస్తానని కెసిఆర్ హామీ ఇచ్చినట్టు తెలుస్తున్నది.

మరోవైపు ఇంతవరకు తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరగలేదు. నవంబర్ వరకు మంత్రి వర్గ విస్తరణ ఉండదని పార్టీ వర్గాలనుంచి సమాచారం. పార్టీలో చేరి..రెండునెలలు గడుస్తున్నా.. ఇంతవరకు తనకు మంత్రిపదవి దక్కకపోవడంతో తుమ్మల అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే… నవంబర్ లో జరిగే మంత్రి వర్గ విస్తరణలో తుమ్మలకు మంత్రి పదవి దక్కుతుందని.. పార్టీవర్గాలు చెబుతున్నాయి.