గురువారం మార్చి 1.. సాయంత్రం ఫైవ్ ఫార్టీ అంటున్న సూపర్ స్టార్ ఫాన్స్!!!

Thursday, March 1st, 2018, 11:58:19 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు కు అతిధి, కొన్నాళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన ఖలేజా చిత్రాలు ప్లాప్ గా నిలవడంతో ఆయన అభిమానులు కొంత నిర్తసాహపడ్డారు. అయితే ఆ తరువాత శ్రీను వైట్ల, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన దూకుడు చిత్రం సూపర్ డూపర్ హిట్ అయినా విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని ఓ పాట ప్రస్తుతం ట్విట్టర్ లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో మహేశ్, సమంతలపై చిత్రీకరించిన ‘గురువారం మార్చి 1.. సాయంత్రం ఫైవ్ ఫార్టీ.. తొలిసారిగా చూశానే నిన్ను అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే.

కాగా సరిగ్గా ఈరోజు కూడా గురువారం మార్చి 1 కావడంతో నెటిజన్లు, మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఈ పాటను గుర్తు చేసుకుంటున్నారు. దీనిపై ఆ చిత్ర సంగీత దర్శకుడు థమన్ కూడా స్పందించారు. నా హృదయానికి అతిదగ్గరగా ఉండే చిత్రమిది. మన సూపర్ స్టార్ తో నా మొదటి చిత్రం. 2011లో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన, నాకు ఫిల్మ్ ఫేర్ అవార్డు సంపాదించి పెట్టిన ‘దూకుడు’ ఆడియో, మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయని ఆయన గురువారం మార్చొకటి ఈరోజు’ అంటూ తన ట్వీట్ లో ఆనందం వ్యక్తం చేశారు…