వీడియో : ప‌్రియురాలి కోసం వీధులు ప‌ట్టిన హీరో!

Tuesday, March 13th, 2018, 09:53:07 PM IST


ఇల్లు క‌ట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్ద‌లు. కానీ ఈ కుర్రాడు మాత్రం ప్రేమించి చూడు.. ప్రియురాలు మిస్స‌యిన‌ప్పుడు చూడు! అంటున్నాడు. అంత‌గా ఏం కష్టం వ‌చ్చింద‌బ్బా! అని ఆరాతీస్తే ఇదిగో ఇలా పాట రూపంలో ఆ క‌ష్టాన్ని ఎంత‌ విన‌సొంపుగా చెప్పాడో! వీనుల విందైన‌, ప‌సందైన ఈ పాట‌ను మీరే వీక్షించండి.. ఆస్వాధించండి.
ప్రేమ‌.. విర‌హం.. వేద‌న .. ఆత్రం.. ఇలా అన్ని ఎమోష‌న్స్‌ని క‌లిపి తెర‌కెక్కించిన‌ `భాఘి 2` లేటెస్ట్ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది.

హృతిక్ రోష‌న్ త‌ర్వాత అంత‌టి ప్ర‌తిభావంతుడిగా పాపుల‌రైన‌ టైగ‌ర్ ష్రాఫ్ `భాఘి 2`తో యాక్ష‌న్ హీరోగా మ‌రో లెవ‌ల్ చూపించేందుకు త‌ప‌న ప‌డుతున్నాడు. ఆ క‌ష్టం పోస్ట‌ర్ల‌లో, వీడియోల్లో క‌నిపిస్తోంది. `భాఘి 2` క‌థాంశం తాను మిస్స‌యిన ప్రేమికురాలిని వెతుక్కుంటూ వెళ్ల‌డ‌మే. అస‌లే దిశాప‌టానీతో నిండా ప్రేమ‌లో ఉన్న టైగ‌ర్ ఇక అలాంటి అవ‌కాశం వ‌స్తే వ‌దులుకుంటాడా? ఈ పాట‌లో జీవించేశాడంటే న‌మ్మండి.. మేం చెప్పితే న‌మ్మ‌రా.. అయితే చూసి మీరే డిసైడ్ కండి! మార్చి 30న `భాఘి 2` రిలీజ‌వుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments