అచ్చు గుద్దినట్లు ఆ హీరోలనే ఉన్నాడు!

Friday, July 27th, 2018, 11:19:20 PM IST

మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురు ఉంటారని చాలా సార్లు వినే ఉంటారు. ముఖ్యంగా సినిమాల్లో ఈ డైలాగ్ ను సరదాగా వాడుతుంటారు. ఇకపోతే ఇటీవల ఒక సినిమా హీరోని పోలిన వ్యక్తి కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. భాగీ 2 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టైగర్ ష్రాఫ్ తన అభిమానుల సంఖ్యను కూడా పెంచుకున్నాడు. ఇకపోతే రీసెంట్ టైగర్ ష్రాఫ్ 2 అని ఒక ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

అస్సాంకు చెందిన డేవిడ్‌ సహరియా అనే యువకుడు అచ్చుగుద్దినట్టుగా ఒక యాంగిల్ లో టైగర్ ష్రాఫ్ లా ఉన్నాడు. అతను మోడల్‌ కావడంతో నిరంతరం తన పోటోలను సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తుంటాడు. ఇటీవల రెండు మూడు ఫొటోలు బాగా వైరల్ అవ్వడంతో మొదట అతన్ని టైగర్ ష్రాఫ్ అనుకున్నారు. ఇక ఆ తరువాత డేవిడ్ అని తెలియడంతో నమ్మలేకపొతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments