ప్రపంచ వ్యాప్తంగా 3,52,168 కి చేరిన కరోనా మృతుల సంఖ్య!

Wednesday, May 27th, 2020, 08:14:29 AM IST

కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఇపుడు అపుడే తగ్గేలా లేదు. ప్రపంచ అగ్ర దేశాలను సైతం ఈ మహమ్మారి భయాందోళనకు గురి చేస్తుంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి భారిన పడి రోజుకి వేలల్లో మరణిస్తున్నారు. ఇప్పటివరకు కరోనా వైరస్ మహమ్మారి భారిన పడిన వారి సంఖ్య 56,81,601 కి చేరింది. అయితే ఇందులో 24,30,461 మంది కరోనా వైరస్ భారిన పడి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 28,98,972 మంది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా బాధపడుతున్నారు.

ఇప్పటివరకు ఈ వైరస్ కు వాక్సిన్ లేకపోవడం తో రోజురోజుకీ ఈ వైరస్ భారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పటి వరకూ 3,52,168 మంది ఈ వైరస్ భారిన పడి మృతి చెందారు. అయితే ఇందులో అత్యధికంగా ఎక్కువగా అమెరికా లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా లో కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కారణంగా లక్ష కి పైగా మృతి చెందారు. ఈ వైరస్ కారణంగా దేశం అతలాకుతలం అవుతుంది. ఒక్క అమెరికా లోనే లక్ష 579 మంది ఈ వైరస్ భారిన పడి మరణించారు.

అయితే కరోనా వైరస్ భారిన పడి అత్యధికంగా మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది ఈ దేశాల్లోనే.అమెరికా తర్వాత యూ కే లో 37,048, ఇటలీ లో 32,955, స్పెయిన్ లో 27,117, బ్రెజిల్ లో 24,549 మంది మరణించారు. అయితే ఇంకా వాక్సిన్ అందుబాటులోకి రాకపోవడం తో ప్రజలు జాగ్రత్త చర్యలు పాటించాలి అని ఆరోగ్య సంస్థలు, వైద్యులు, నిపుణుల సలహాలు సూచనలు ఇస్తున్నారు.