బ్రేకింగ్: భారత్ లో 4,337 కి చేరిన కరోనా మృతుల సంఖ్య!

Wednesday, May 27th, 2020, 10:31:36 AM IST


కరోనా వైరస్ మహమ్మారి భారత్ లో వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే కరోనా వైరస్ కి ఇప్పటివరకు ఎటువంటి వాక్సిన్ అందుబాటులో లేకపోవడం తో కరోనా వైరస్ భారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.భారత్ లో గడిచిన 24 గంటల్లో 170 మంది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మృతి చెందారు. భారత్ లో ఒక్కరోజులోనే 6,387 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

కొత్తగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తో భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్ మహమ్మారి సోకిన వారి సంఖ్య 1,51,767 కి చేరింది. ఇప్పటి వరకూ ఈ మహమ్మారి భారిన పడి కోలుకున్న వారి సంఖ్య 64,425 కి చేరింది.ప్రస్తుతం భారత్ లో 83,004 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి. అయితే ఇప్పటివరకు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 4,337 మంది మరణించారు.

ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో కరోనా వైరస్ ప్రభావం తక్కువగానే ఉంది అని తెలుస్తోంది. గత రెండు రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది అని తెలుస్తోంది. అంతేకాక కరోనా వైరస్ సోకి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. మన దేశం లో ఎక్కువగా మహారాష్ట్ర లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు 54,758 పాజిటివ్ కేసులకి గాను, 16,954 మంది కొలుకోగా, 1,792 మంది మరణించారు.