బిగ్ న్యూస్: ప్రారంభమైన తిరుపతి, సాగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ!

Sunday, May 2nd, 2021, 09:02:35 AM IST

భారత్ లో కీలకంగా బెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం రాష్ట్రాలతో పాటుగా, కేంద్ర పాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరి ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం అయింది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీ కి ఎంత ఆధిక్యం అనేది అంచనా వేసింది. అయితే ఇందులో కీలకం గా పశ్చిమ బెంగాల్ లో బీజేపీ మరియు తృణమూల్ కాంగ్రెసు పోటీ రసవత్తరంగా సాగానున్నట్లు తెలుస్తోంది. అయితే తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక మరియు నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక కి ఇప్పటికే ఎన్నిక జరగగా, నేడు అందుకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం అయింది.

అయితే తిరుపతి పార్లమెంట్ నియోజక వర్గం ఉపఎన్నిక లో మొత్తం 11,02,068 మంది ఓటర్లు తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. అధికార పార్టీ వైసీపీ కి చెందిన అభ్యర్ధి గురుమూర్తి, టీడీపీ కి చెందిన అభ్యర్ధి పనబాక లక్ష్మి మరియు బీజేపీ తరపున కే. రత్న ప్రభ లతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నుండి చింతామోహన్ పోటీ చేశారు. మొత్తం 28 మంది అభ్యర్దులు నేడు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దంగా ఉన్నారు. అయితే సాగర్ ఉపఎన్నిక లో మొత్తం 41 మంది అభ్యర్దులు పోటి పడ్డారు. అయితే నేడు సాయంత్రం లోగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి అయి, విజేతను ప్రకటించనున్నారు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీ వైసీపీ కి మరియు తెరాస లకు ఈ రెండు చోట్ల ఆధిక్యం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.