ఆ టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన నందమూరి హీరో ?

Wednesday, December 28th, 2016, 10:30:12 PM IST

ntr
‘జనతా గ్యారేజ్’ తరువాత చాలా రోజులకు ఓ సినిమాకు కమిట్ అయ్యాడు ఎన్టీఆర్. ‘పవర్’ ఫేమ్ బాబీ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాకు సంబందించిన స్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ‘జనతా గ్యారేజ్’ తో వందకోట్ల మార్కెట్ కు చేరువలో ఉన్న ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాకూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇక బాబీ తో తానూ చేసే సినిమాలో ఏకంగా మూడు పాత్రల్లో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి? ఈ సినిమాలో మూడు పాత్రలతో తన నట విశ్వరూపం చూపిస్తాడని అంటున్నారు, అందుకనే ఈ సినిమాకు కూడా ”విశ్వరూపం” అనే టైటిల్ పెడతారంటూ .. జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ టైటిల్ పై నందమూరి అభిమానుల్లో రకరకాల ఊహాగానాలు, ముఖ్యంగా ఈ టైటిల్ బాగాలేదనే, టైటిల్ నిరుత్సాహంగా ఉందని టాక్ ఎక్కువైంది. ఈ టైటిల్ పై వస్తున్న పుకార్లపై నందమూరి కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చాడు. ఎన్టీఆర్ తో తానూ తీస్తున్న సినిమా టైటిల్ పై వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటిస్తున్న విషయం నిజమే అని టైటిల్ ని వీలైనంత త్వరలోనే ప్రకటిస్తామని చెప్పాడు. ఈ సినిమా టైటిల్ పై ఎలాంటి పుకార్లను నమ్మొద్దని, త్వరలోనే మేమె తెలియచేస్తామని అన్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments