రెండు భాగాల్లో ఎన్టీఆర్ బయోపిక్ ?

Thursday, May 24th, 2018, 11:11:26 AM IST

మహానటుడు అన్న నందమూరి తారకరామారావు జీవిత కథతో తెరకెక్కే సినిమా నుండి దర్శకుడు తేజ తప్పుకోవడంతో ఈ సినిమా పట్టాలు ఎక్కుతుందా లేదా అన్న సందేహాలు మొదలయ్యాయి. నందమూరి బాలకృష్ణ హీరోగా ఆయన నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్ పేరుతొ తెరకెక్కే ఈ సినిమా బాధ్యతలను దర్శకుడు క్రిష్ పై పెట్టాడట బాలయ్య. ఇదివరకే క్రిష్ తో బాలయ్య చేసిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా మంచి హిట్ అవ్వడంతో ఈ సినిమాను క్రిష్ అయితేనే న్యాయం చేస్తాడని భావించిన బాలయ్య క్రిష్ ని రంగంలోకి దింపుతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ సినిమాల హావా మొదలైంది. ఇప్పటికే విడుదలైన సావిత్రి బయోపిక్ మహానటి మంచి హిట్ అయినా నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్ పై అంచనాలు ఎక్కువయ్యాయి. అయితే ఎన్టీఆర్ జీవితం గురించి ఒక్క సినిమాతో చెప్పలేమని .. అందుకే రెండు పార్ట్శ్ గా తీయాలని ప్లాన్ చేశారట.

  •  
  •  
  •  
  •  

Comments